ఎంత ఫ్యాన్స్‌ అయితే మాత్రం రాత్రిపూట ఫామ్‌హౌస్‌లో చొరబడితే..

సల్మాన్‌ ఖాన్‌ అభిమానులమని, ఆయనను కలిసేందుకు వచ్చామని చెప్పిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎంత ఫ్యాన్స్‌ అయితే మాత్రం రాత్రిపూట ఫామ్‌హౌస్‌లో చొరబడితే..
  • ముంబైలోని సల్మాన్‌ ఫామ్‌హౌస్‌లో చొరబందుకు ఇద్దరి యత్నం
  • అరెస్టు చేసిన పోలీసులు

ముంబైలోని పన్వేల్‌ సమీపంలోని సల్మాన్‌ ఖాన్‌కు చెందిన ఫాంహౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జనవరి 4వ తేదీన జరిగింది. నిందితులను అజేశ్‌ కుమార్‌ ఓప్రకాశ్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌ తేజ్‌సింగ్‌ సిఖ్‌గా గుర్తించారు. అర్పిత ఫాంహౌస్‌ వద్దకు వచ్చిన ఈ ఇద్దరు యువకులు తాము సల్మాన్‌ అభిమానులనుమని, ఆయనను కలుసుకునేందుకు వచ్చామని అక్కడి సెక్యూరిటీ గార్డులకు చెప్పారు.


అయితే.. వారు అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి తప్పుడు పేర్లు చెప్పారు. సెక్యూరిటీ గార్డులు వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు ఫాంహౌస్‌లోకి ప్రవేశించేందుకు రహస్యంగా గోడ ఎక్కి, గొడపై ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను కత్తిరించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి, వారిని పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి ఆధార్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.