Viral Video | కారు ఇంజిన్‌లోకి దూరిన కొండ‌చిలువ‌..

Viral Video | కారు ఇంజిన్‌లోకి దూరిన కొండ‌చిలువ‌..

Viral Video | మొన్న ట్ర‌క్కు డ్రైవ‌ర్ క్యాబిన్‌లోకి కొండ‌చిలువ దూరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కారు ఇంజిన్‌లోకి దూరింది మ‌రో కొండ‌చిలువ‌. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని చిత్త‌రంజ‌న్ పార్కు వ‌ద్ద వెలుగు చూసింది.

ఓ వ్య‌క్తి త‌న కారును స్టార్ట్ చేసేందుకు య‌త్నించ‌గా, అది స్టార్ట్ కాలేదు. దీంతో కారు బోనెట్‌ను తెరిచిచూడ‌గా కొండ‌చిలువ క‌నిపించింది. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా, అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించాడు.

చిత్త‌రంజ‌న్ పార్కు వ‌ద్ద‌కు చేరుకున్న అట‌వీశాఖ అధికారులు కొండ‌చిలువ‌ను ప‌రిశీలించారు. 30 నిమిషాల పాటు తీవ్రంగా శ్ర‌మించి, కొండ‌చిలువ‌ను ప‌ట్టుకున్నారు. అనంత‌రం దాన్ని అడ‌విలో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.