డబ్బులిచ్చి త్రిషని పిలిపించుకున్నారు.. చెత్త కామెంట్స్‌పై విశాల్ ఫైర్

చెన్నై చంద్రం త్రిష ఇటీవలి కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య మన్సూర్ అలీఖాన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేయగా, ఆ సమయంలో ఆమెకి చాలా మంది సినీ ప్రముఖులు సపోర్ట్ అందించారు. మన్సూర్ వ్యాఖ్యలని ఖండించడంతో ఆయన చేసేదేం లేక క్షమాపణలు చెప్పాడు. ఇక ఇప్పుడు త్రిషపై అన్నా డీఎమ్కే పార్టీకి చెందిన నాజకీయ నాయకుడు ఏవీ రాజు ఓ సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. డబ్బులిచ్చి త్రిషని రిసార్ట్‌కు పిలుపించుకున్నారంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, దీనిపై త్రిష అభిమానులతో పాటు నెటిజెన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ రాజకీయ నాయకుడి కామెంట్స్ పై త్రిష స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. అందరి దృష్టిని ఆకర్షించడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతున్న నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈ ఇష్యూని అస్సలు సహించను. కఠినమైన చర్యలు తీసుకుంటాను. దీనిపై మా లీగల్ టీమ్ చూసుకుంటుంది. చెప్పాల్సింది, చేయాల్సింది అంతా కూడా వారే చూసుకుంటారని త్రిష తన ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం త్రిష ట్వీట్ నెట్టింట వైరల్ కాగా, దీనిపై పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. విశాల్ స్పందిస్తూ..ఓ రాజకీయ పార్టీకి చెందిన మూర్ఖుడు ఒకరు.. మన సినీవర్గానికి చెందిన ఒక వ్యక్తి గురించి అత్యంత దారుణంగా మాట్లాడడం వింటే అసహ్యం వేస్తుంది. ఇది ఆయన పబ్లిసిటీ కోసం చేశారని నాక తెలుసు.
టార్గెట్ చేసిన వ్యక్తి పేరును గానీ నేను ప్రస్తావించను. మీ ఇంట్లో ఉన్న స్త్రీలు మీరు చేసిన ఈ పని తర్వాత కూడా క్షేమంగా రావాలని కోరుకుంటారు. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధగా ఉందంటూ విశాల్ తన అసహనం వ్యక్తం చేశాడు. ఇక రానున్న రోజులలో దీనిపై ఎవరెవరు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో సందడి చేస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరుతో కలిసి విశ్వంభర అనే సినిమా చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఆ మూవీ సెట్స్‌లో జాయిన్ అయినట్టు చిత్ర బృందం ప్రకటించింది.