ప‌బ్లిక్ ఈవెంట్‌లో న‌టిపై అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. వెంటాడి మ‌రీ కొట్టిందిగా.!

ప‌బ్లిక్ ఈవెంట్‌లో న‌టిపై అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. వెంటాడి మ‌రీ కొట్టిందిగా.!

ప‌బ్లిక్ ఈవెంట్స్‌లో లేడి స్టార్స్‌కి అప్పుడ‌ప్పుడు ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. అయితే అవి పొర‌పాటున చోటు చేసుకుంటే వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కాని కావాల‌ని చేస్తే మాత్రం దేహ‌శుద్ధి చేయ‌కుండా ఉండ‌రు. తాజాగా ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘కెప్లెన్ మిల్ల‌ర్’ ఆడియో వేడుకలో ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. ఈ మూవ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల స‌మ‌క్షంలో చెన్నై నెహ్రూ స్టేడియంలో జ‌రిగింది.చిత్రంలో ఐశ్వ‌ర్య ర‌ఘుప‌తి కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈవెంట్ కి ఆమె కూడా హాజ‌రైంది. అయితే ఈవెంట్ లో ఆమెకి ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఈవెంట్ ముగిసిన అనంత‌రం అంతా బ‌య‌ట‌కు వెళ్లిపోతున్న స‌మ‌యంలో ఐశ్వ‌ర్య‌తో ఫోటో కోసం కొంత మంది ప్ర‌య‌త్నించారు.ధనుష్‌ అభిమానులు ఎక్కువగా ఉండటంతో వారిని దాటుకుని ముందుకు వెళ్లటం కొంచెం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గుంపులో గోవింద అన్నట్లు ఐశ్వర్య రఘుపతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడ్ని గుర్తించి ఆ యువకుడ్ని పట్టుకుని కొడుతూ తిట్టింది. తన తప్పు తెలుసుకున్న ఆ యువకుడు ఆమెకు క్షమాపణ చెప్పిన స‌రే అత‌డిని మాత్రం మాములుగా కొట్ట‌లేదు. తీవ్రంగా ఫైర్‌ అయింది. కొంచెం సేపటి తర్వాత ఆ యువకుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోని చూసిన వారు వీళ్లను ఊరికే వదిలేయకూడదు’’.. ‘‘ఐశ్వర్య రఘుపతి మంచి పని చేశారు. ఇంకా నాలుగు తగిలించాల్సింది అని అన్నారు. అయితే ఈ విష‌యంపై ఐశ్వ‌ర్య ర‌ఘుప‌తి త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ కూడా పెట్టింది.

ఓ పోకిరి నన్ను వేధించి నా నుండి పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. కాని అత‌డిని ప‌ట్టుకొని దేహ‌శుద్ధి చేసారు.అంత మందిలో ఒక మ‌హిళ ప్రైవేట్ పార్ట్‌ని తాకే ధైర్యం ఉంటుంద‌ని నేను అనుకోలేదు. నా చుట్టూ మంచి మ‌నుషులు ఉన్నా కూడా కొంత మంది రాక్ష‌సుల వ‌ల‌న భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఈ అమ్మ‌డు పేర్కొంది. ఇక కెప్టెన్ మిల్లర్ మూడు భాగాల ఫ్రాంచైజీగా సెట్ చేయబడిందని, ఇది సినిమా మొదటి భాగం అని పేర్కొన్నారు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్. కాగా, చిత్రంలో ధ‌నుష్‌ సరసన ప్రియాంక అరుల్‌మోహన్‌ నటిస్తున్నారు. శివరాజ్‌ కుమార్‌, వినాయకన్‌, నివేదితా సతిష్‌, ఐశ్వర్య రఘుపతి, ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. కెప్టెన్ మిల్లన్ రన్‌ టైం 157 నిమిషాలు (2 గంటల 37 నిమిషాలు) ఉంటుంద‌ని తెలుస్తుంది.జ‌న‌వ‌రి 12న చిత్రం విడుద‌ల కానుంది. తమిళం, కన్నడ, హిందీలలో జనవరి 12న థియేటర్లలో రిలీజ్ చేయ‌నుండ‌గా, తెలుగులో ఎప్పుడు అనే దానిపై క్లారిటీ లేదు.