నా తండ్రి డబ్బులు ఎగ్గొట్టాడు అంటూ అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే తాజాగా బన్నీ సోషల్ మీడియా స్టేటస్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. అల్లు అరవింద్ ని ఉద్దేశిస్తూ నాకు డబ్బులు ఇవ్వలేదని అల్లు అర్జున్ అన్నారు. సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్న అల్లు అర్జున్ కి డబ్బులు అవసరం ఏమొచ్చింది? అల్లు అరవింద్ ఎందుకు డబ్బులు చెల్లించలేదు? అనేది తన పోస్ట్‌లో తెలియజేశారు అల్లు అర్జున్. 1985లో విడుదలైన విజేత సూపర్ హిట్ కాగా, ఇది అల్లు అర్జున్ తొలి సినిమా. ఇందులో నటించినందకు తనకి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ బన్నీ చెప్పుకొచ్చారు.
విజేత చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కాగా, ఆ సినిమాలో నటించినందుకు తనకు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా అరవింద్ ఇవ్వలేదని బన్నీ చెప్పుకొచ్చారు. విజేత 100 డేస్ షీల్డ్ ను పట్టుకుని ఉన్న తన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఫోటోను షేర్ చేస్తూ.. తనకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు.ఇక ఆ షీల్డ్ లో అల్లు రామలింగయ్య ఫోటో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకుడు కాగా, ఈ మూవీ హిందీ చిత్రం సాహెబ్ కి రీమేక్.
నా తండ్రి డబ్బులు ఎగ్గొట్టాడు అంటూ అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్విజేత చిత్రం అల్లు అర్జున్‌కి డెబ్యూ మూవీ కాగా, ఈ సినిమా తర్వాత స్వాతి ముత్యం, డాడీ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప చిత్రానికి గాను బన్నీకి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. పుష్ప చిత్రం బన్నీ కెరీర్‌లోనే స్పెషల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో బన్నీ నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.