పబ్లిక్‌లో తొలిసారి కనిపించిన పవన్ సతీమణి..అనాథ పిల్లలతో క్రిస్మస్ వేడుకలు

ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఆయన రాజకీయాలలోకి రాకముందు పెద్దగా వార్తలలోకి వచ్చేవారు కాదు, కాని ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చారో ఆయనని టార్గెట్ చేస్తూ చాలా మంది విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తుంటారు. పవన్ ముందుగా వైజాగ్‌కి చెందిన నందిని అనే యువతిని పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చి రేణూ దేశాయ్‌ని పెళ్లాడాడు. అనుకోని పరిస్థితులలో ఈమెకి విడాకులు ఇచ్చి అన్నా లెజినోవాతో సంసారం చేస్తున్నారు.
అన్నా లెజినోవా పెద్దగా మనకు బయటకు కనిపించారు. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ వేడుకలలోను అలానే ఎయిర్‌పోర్ట్‌లో మాత్రమే కనిపిస్తుంటుంది. అయితే తొలిసారి ఆమె పబ్లిక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది. తాజాగా అన్నా లెజినోవా.. అనాథ పిల్లలను కలిసింది. అనాథాశ్రమంలో ఆమె సందడి చేసింది. అనాథ పిల్లల సమక్షంలో ఆమె క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా, ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ది చిల్ట్రన్ సంస్థకి ఆదివారం అన్నా సందర్శించారు.
అనాథ పిల్లలతో కలిసి కాసేపు అనా సరదాగా గడపడమే కాక వారితో ముచ్చటించారు. చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. వారి విద్యా బుద్దుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసారు. అనంతరం వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారు. అనాథాశ్రమం కోసం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా అనా కొణిదెలని ఎన్జీవో నిర్వాహకులు సత్కరించారు. ఏదేమైన క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అన్నా లెజినోవా ఇలా పబ్లిక్‌లోకి వచ్చి అనాథ పిల్లలతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం అన్నా లెజినోవా పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఇక పవన్, అన్నాకి ఇద్దరు పిల్లలు ఉండగా, కూతురికి పోలెనా అంజనా, కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేర్లు పెట్టారు.