ఏంటి.. బాలయ్య రాసిన కథతో మోక్షజ్ఞ లాంచ్ కాబోతున్నాడా.. ఇదేదో తేడాగా ఉందే…!

అప్పటి హీరోల వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి సత్తా చాటుతున్నారు. కాని నందమూరి బాలకృష్ణ తనయుడి డెబ్యూ ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి డై హార్డ్ ఫ్యాన్స్ ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. 30 ఏళ్ళు దగ్గరపడుతున్నా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఇంకా కన్‌ఫాం కాలేదు. ఇదిగో అదుగో అంటున్నారు తప్ప ఆయన సినిమా ఇంకా లాంచ్ కాలేదు. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ అయితే మోక్షజ్ఞ వయస్సుకి మూడు నాలుగు బ్లాక్ బస్టర్స్ కూడా కొట్టడంతో ఇప్పుడు బాలయ్యపై ఆ ప్రెషర్ చాలా ఉంది. నా తనయుడు సినిమాలలోకి త్వరలోనే రానున్నాడు అంటున్నాడే తప్ప ఎప్పుడు తీసుకొస్తాడనే క్లారిటీ లేదు.
అయితే భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలకృష్ణను హీరోయిన్ శ్రీలీల ”మోక్షజ్ఞ ఏంట్రి ఎప్పుడు?” అని అడిగింది. అందుకు సమాధానంగా బాలకృష్ణ… వచ్చే ఏడాదే మోక్షజ్ఞ చిత్రం ఉంటుందని, తన కెరీర్ గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నాడు. బాలయ్య రాసిన ఆదిత్య 999 మ్యాక్స్ కథ ఉండగా, ఈ కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చనే చిన్న హింట్ కూడా ఇచ్చాడు. ఈ కథతో పాటు మరికొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారు బాలయ్య. అయితే తాను రాసిన కథను ఒక రాత్రిలో రాసేసినట్టు తెలియజేశారు. అంతేకాదు తన దగ్గర ఇంకో కథ కూడా ఉంది అని అన్నారు. మరి వీటిలో ఏ కథతో బాలయ్య తన తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడా అనేది చూడాలి.
మరోవైపు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి విషయానికి వస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. ప్రీ బిజినెస్ లెక్కల దృష్ట్యా భగవంత్ కేసరి రూ. 67 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే మూడు రోజులకు ఈ చిత్రం కేవలం 24 నుండి 25 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టడంతో భగవంత్ కేసరి చిత్రానికి నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కింది