Bank Holidays in April | ఏప్రిల్ 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 14 రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకు, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేస్తాయి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ల కోసం మెషిన్లను సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలు కలుగుతుంది.
ఏప్రిల్ 1 : ఆర్థిక సంవత్సరం అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.
ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జమాత్ ఉల్ విదా
ఏప్రిల్ 7 : ఆదివారం సందర్భంగా హాలీడే
ఏప్రిల్ 9 : ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ సెలవులు.
ఏప్రిల్ 10 : రంజాన్ కేరళలో సెలవులు
ఏప్రిల్ 11 : రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
ఏప్రిల్ 13 : రెండో శనివారం, బైశాఖి పండగ హాలీడే.
ఏప్రిల్ 14 : ఆదివారం సందర్భంగా మూసివేత
ఏప్రిల్ 15 : బోహాగ్ బిహు, హిమాచల్ డే. అసోం, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 17 : శ్రీరామనవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకుల మూసివేత
ఏప్రిల్ 20 : గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకుల మూసివేత
ఏప్రిల్ 21 : ఆదివారం సెలవు
ఏప్రిల్ 27 : నాలుగో శనివారం
ఏప్రిల్ 28 : ఆదివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.