నిహారిక వరుస ఇంటర్వ్యూలతో సైలెన్స్ అంటూ చైతన్య కామెంట్.. ఏం జరిగిందంటే..!

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవల తెగ హట్ టాపిక్ అవుతుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారికకి ఇక్కడ కలిసి రాకపోవడంతో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ముణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఏం జరిగందో ఏమో తెలియదు కాని అతనితో విడిపోయింది. ప్రస్తుతం పని మీద దృష్టి పెట్టింది. ఇక పలు ఇంటర్వ్యూలలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేసింది. పిల్లలని కూడా కంటానంటూ కామెంట్స్ చేసింది.ప్రేమ మీద నెగెటివ్ ఇంప్రెషన్ అయితే లేదని రిలేషన్ షిప్ వర్కవుట్ కాలేదంటే ఎన్నో కారణాలు ఉన్నాయంటూ పలు కామెంట్స్ అయితే చేసింది నిహారిక.
ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్న నిహారిక వార్తలలో నిలుస్తుంది. ఆమె మాట్లాడే మాటలు చైతన్యకి కాస్త హర్టింగ్ గా అనిపించాయో ఏమో తెలియదు కాని ఆయన తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఆసక్తికర కోట్ పెట్టాడు. ఇది నిహారిక కోసమే అంటున్నారు నెటిజన్స్.ఆ నోట్ లో సైలెన్స్ సైలెన్స్ అంటూ ఉండగా … విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, మీరు నీటి అడుగున ఉన్నప్పుడు మీరు అనుభవించే నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి మిమ్మల్ని ఆవరించే నిశ్శబ్దం, చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో నిశ్శబ్దం.మీ ఆలోచనలలో మీరు కోరుకునే నిశ్శబద్ధం.. ఇలా నిశ్శబ్ధం అనేది ప్రాణ శక్తిని ప్రకృతి నుండి వేరు చేస్తుంది అంటూ కవిత రూపంలో ఆ కోట్ రాసాడు చైతన్య
చైతన్య పోస్ట్‌పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మళ్లీ ఏం జరిగిందన్నా ఎందుకు సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టావంటూ కామెంట్ చేస్తున్నారు. నిహారిక విడాకుల తర్వాత ఏమైన డిప్రెషన్‌కి వెళ్లావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైన ఇప్పుడు చైతన్య పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక నిహారిక, చైతన్య ల పెళ్లి 2020లో రాజస్థాన్ వేదికగా అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లికి మెగా కుటుంబ సభ్యులు అంతా తరలి వచ్చారు. నేషనల్ మీడియా కూడా నిహారిక పెళ్లి తతంగాన్ని కవర్ చేసింది. కొన్నాళ్ల పాటు మంచిగా ఉన్న ఈ జంట 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి ఎవరి దారులు వారు చూసుకున్నారు.