చిరంజీవి హ‌నుమంతుడు భ‌క్తుడు కావ‌డం వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా.. ఫ‌స్ట్ టైం రివీల్

చిరంజీవి హ‌నుమంతుడు భ‌క్తుడు కావ‌డం వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా.. ఫ‌స్ట్ టైం రివీల్

ఇటీవ‌లి కాలంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న చిత్రాల‌కి త‌న‌దైన స‌పోర్ట్ అందిస్తున్నాడు. తాజాగా యువ హీరో తేజ స‌జ్జ న‌టించిన హ‌నుమాన్ చిత్రానికి మెగాస్టార్ స‌పోర్ట్‌గా నిలిచాడు. చిన్న హీరో సినిమా బ‌డా రేంజ్‌లో తెర‌కెక్క‌గా, ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సినిమా హీరో, హీరోయిన్లు, డైరెక్టర్, ప్రోడ్యూసర్, చిత్ర నటినటులు హాజరు కాగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై సంద‌డి చేశారు. అయితే హ‌నుమాన్ భ‌క్తుడైన చిరంజీవి ఈ స్థాయికి రావ‌డానికి కారణం ఆంజనేయస్వామీనే అని చెప్పారు.

తన ఆరాధ్య దైవం హనుమంతుడి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పే సందర్భం రాలేదు. కానీ హ‌నుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావ‌డంతో క్లారిటీ ఇచ్చాడు. తనలోని ఈ క్రమశిక్షణకు, కష్టపడేతత్వానికి హనుమంతుడే కారణమని చెప్పిన చిరు… ఆయనపై ప్రేమ, భక్తినే తనని నడిపిస్తుందని, ఓ రకంగా తన కుల ధైవంగా మారిందని చెప్పారు. హిందుత్వంగురించో, మరో మతం గురించో అనేది ఇక్కడ మ్యాటర్‌ కాదని, ఒక ఇన్‌ స్పైరింగ్‌ పర్సనాలిటీ అని, మనం పైకి రావడానికి, మనం ఆయనకు సరెండర్ అయిపోతే మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే దానికి తానే ఉదాహరణ అని, ఆయన్ని తీసుకోవడం వల్లే ఈ స్థానంలో ఉన్నట్టుగా చిరంజీవి న‌మ్ముతున్న‌ట్టు తెలియ‌జేశారు.

చిరంజీవి నాన్న కమ్యూనిస్ట్ కాగా, అసలు దేవుడే నమ్మేవాడు కాదట. అమ్మ ఒత్తిడి మేరకు ఎప్పుడో ఒకసారి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే వాళ్లమని తెలిపారు చిరు. పొన్నూరులో తాను ఏడో తరగతి చదువుకునే సమయంలో అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉండేదట. రోజూ దెండం పెట్టుకుని వచ్చేవాడట. ఆ నెక్ట్స్ ఇయర్‌ 8వ తరగతి బాపట్లలో చదువుకున్నాడట. అక్కడ కూడా ఆంజనేయుడి గుడి ఉండేదట. సాయంత్రంట్యూషన్‌ వెళ్లి వచ్చే సమయంలో ఆ గుడి వద్ద ప్రసాదం ఇచ్చేవారట. ఆ ప్రసాదం కోసం అక్కడికి వెళ్లేవాడట చిరు. అలా ప్రసాదం ద్వారా ఆంజనేయుడిపై భక్తి ఏర్పడిందన్నారు. ఆ గుడి వద్ద ప్రసాదం తింటూ, పూజారి చెప్పే విషయాలు వింటూ హనుమాన్‌ ఛాలిసా చదివేవాడట. అలా తెలియకుండా ఆంజనేయుడిపై భక్తి భావం తనలో ఏర్పడిందన్నారు. ఇక మొగల్తూరులో చదువుకునే సమయంలో అక్కడ రోడ్డుపై మిఠాయి కొంటే హనుమంతుడు ఉన్న క్యాలెండర్‌ వచ్చిందట. అది ఉదరం చీల్చుకుని ఉన్న హనుమంతుడి క్యాలెండర్‌ అని, ఆ బొమ్మ ఇప్పటికీ తన ఇంట్లో ఉందని, దాన్ని ఎన్నో ఏళ్లుగా పూజిస్తున్నట్టు తెలిపారు చిరంజీవి. అప్పట్నుంచి ఆయన వెంట నేను పడ్డానా, నా వెంట ఆయన పడ్డాడో తెలియదు గానీ, ఇప్పటికీ తనలో హనుమంతుడు అంతర్భాగమైపోయాడని తెలిపారు.