కేవలం 29 రోజులలో షూటింగ్ పూర్తైన చిరంజీవి సినిమా.. అది ఏదంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ స్థాయి చాలా పెరిగింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా క్రేజ్ ఎల్లలు దాటింది. బాహుబలి మూవీ చరిత్ర సృష్టించడంతో ఇప్పటి టాలీవుడ్ దర్శకులంతా కూడా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాల కోసం ఏళ్ల తరబడి కాల్షీట్స్ తీసుకుంటున్నారు. బాహుబలి ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాల కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్లు కేటాయించాడు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా చాలా రోజుల పాటే పని చేశారు. ఇక మహేష్ బాబు కూడా తన 29వ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు కాల్షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. రాజమౌళితో పాటు ఇతర దర్శకులు సైతం ఇప్పుడు ఒకటి లేదా రెండు మూడు సంవత్సరాల పాటు సినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఇలా ఏళ్ల తరబడి ఒక్క సినిమానే చేస్తుండే సరికి ఆయా హీరో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం లేకుండా పోతుంది. అప్పట్లో చూస్తే హీరోలందరు ఏడాదికి ఆరు లేదా ఏడు సినిమాలతో ప్రేక్షకులని పలకరించేవారు. రెండు మూడు నెలలో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే విడుదల చేసే వారు. అశేష ప్రేక్షకాదరణ ఉన్న మెగాస్టార్ చిరంజీవి సైతం తక్కువ కాలంలో సినిమాలు పూర్తి చేశారు. అప్పట్లో ఆయన ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో పలకరించేవారు. ఇప్పుడు మాత్రం చిరు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అయితే చిరంజీవి కెరియర్‌లో ఆయన ఒక సినిమాని కేవలం 29 రోజులలో షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కోడి రామకృష్ణ.. చిరంజీవి, మాధవి ప్రధాన పాత్రలలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాని కేవలం 29 రోజులలో నిర్మించి విడుదల చేయగా, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 1982వ సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా 500 రోజుల పాటు ప్రేక్షకులను థియేటర్లలో ఎంతగానో అలరించింది..ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పై కే రాఘవ నిర్మించారు. టలు డైలాగ్స్ గొల్లపూడి అందించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.అయితే చిరంజీవి క్రియేట్ చేసిన రికార్డ్స్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి.