పుష్పలా మారిన డేవిడ్ వార్నర్.. గ్రౌండ్‌లో తెగ సందడి చేశాడుగా..!

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తెలుగు వాళ్లకి కూడా చాలా దగ్గరయ్యాడు. సన్‌రైజర్స్ తరపున చాలా మ్యాచ్‌లు ఆడిన నేపథ్యంలో వార్నర్‌ని మనోళ్లు తెలుగు క్రికెటర్‌లానే భావించారు. అంతేకాదు తెలుగు సినిమాలకి సంబంధించిన డైలాగ్స్‌కి రీల్స్ కూడా చేసి మరింత దగ్గరయ్యారు. ఈ వరల్డ్ కప్‌లో దుమ్ము రేపుతున్న డేవిడ్ వార్నర్.. న్యూజిలాండ్‌తో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే బ్యాటింగ్‌తో అదరగొట్టిన వార్నర్ ఫీల్డింగ్ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ శ్రీవల్లి పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
డేవిడ్ వార్నర్ కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81) , గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ప్యాట్ కమిన్స్(14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇక భారీ లక్ష్య చేధనకి దిగిన న్యూజిలాండ్ ధీటుగానే ఆడింది.
న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులే చేసి కొద్ది రన్స్ తేడాతో ఓటమి పాలైంది. రచిన్ రవీంద్ర(89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా.. డారిల్ మిచెల్(51 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 54), జేమ్స్ నీషమ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. అయితే మ్యాచ్‌లో చివరి రెండు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా.. జేమ్స్ నీషమ్ స్ట్రైకింగ్ కోసం డబుల్ తీసే ప్రయత్నంలో లబుషేన్ సూపర్ త్రోకు రనౌట్ కావడంతో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు అద్భుతమైన ఫీల్డింగ్‌తో రెండు బౌండరీలు ఆపడం కూడా న్యూజిలాండ్ విజయానికి బ్రేకులు పడేలా చేసింది. ఇక శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 229 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్ జట్టు 142 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ తరపున స్కాట్ ఎడ్వర్డ్స్ 68 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడగా, పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లు తీసాడు.
David Warner dancing on Pushpa song.
– David Warner, What a character! pic.twitter.com/r8kUEXyEzM
— CricketMAN2 (@ImTanujSingh) October 28, 2023