Akula Lalitha | నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత రాజీనామా

Akula Lalitha | నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత రాజీనామా

Akula Lalitha | నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. జిల్లా చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆమె పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న తెలంగాణ మ‌హిళా స‌హ‌కారాభివృద్ధి సంస్థ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు లేఖ‌లో ఆమె పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హ‌యాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్ర‌భుత్వంగా ప‌రిపాల‌న కొన‌సాగుతోంది. స్థానిక సంస్థ‌ల పాల‌న ఎమ్మెల్యేల బానిస పాల‌న‌గా మారింది. స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జ‌డ్పీటీసీల బాధ వ‌ర్ణాతీతంగా ఉంది. ఈ అంశాలు న‌న్ను బాధించాయి. ఈ నేప‌థ్యంలోనే బీఆర్ఎస్‌ను వీడుతున్నాను. మీ నాయ‌క‌త్వంలో ఆరేండ్ల పాటు ప‌ని చేసేందుకు అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని ల‌లిత త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

కొంత‌కాలంగా అసంతృప్తితో ఉన్న ల‌లిత‌, ఆమె భ‌ర్త రాఘ‌వేంద‌ర్‌తో కాంగ్రెస్ నేత‌లు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉంది. ఆమె గ‌తంలో ఎమ్మెల్యేగా కూడా ప‌ని చేశారు.