ఏంటి.. ప్ర‌వీణ్‌కి హ్యాండ్ ఇచ్చి ఫైమా కొత్త ల‌వ‌ర్‌ని చూసుకుందా.. క‌డిగిప‌డేశాడుగా..!

ఏంటి.. ప్ర‌వీణ్‌కి హ్యాండ్ ఇచ్చి ఫైమా కొత్త ల‌వ‌ర్‌ని చూసుకుందా.. క‌డిగిప‌డేశాడుగా..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి హాస్యాన్ని పంచుతున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ షో ద్వారా చాలా మంది వెలుగులోకి వ‌చ్చారు. వారిలో లేడి క‌మెడీయ‌న్ ఫైమా కూడా ఒక‌రు. ఈమె కొన్నాళ్ల పాటు జ‌బ‌ర్ధ‌స్త్‌లో సంద‌డి చేసి ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోకి కూడా వెళ్లింది. అక్క‌డ త‌న ఆట‌తో, మాట‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.హౌజ్‌లో ఫైమా రెండు మూడు వారాలు ఉండటమే కష్టం అనుకున్నారందరికి త‌న ఆట‌తో తానేంటో నిరూపించింది. ఏకంగా 13 వారాలు హౌస్లో ఉండి శ‌భాష్ అనిపించుకుంది. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ఫైమా త‌న ప్రియుడు ప్ర‌వీణ్ గురించి ప‌లు కామెంట్స్ చేసింది. అత‌ను త‌న‌కు చాలా స‌పోర్ట్ చేశాడ‌ని, క‌ష్టాల‌లో ఆదుకున్నాడ‌ని పేర్కొంది.

అయితే హౌజ్ నుండి ఫైమా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌వీణ్ పెద్ద హంగామానే చేశాడు. ఆమెకి గ్రాండ్ వెల‌కమ్ చెప్ప‌డం, త‌న మెడ‌లో ఉన్న చైన్‌ని ఆమెకి బ‌హుక‌రించ‌డం వంటివి చేశాడు. వారి బంధం స‌వ్యంగానే సాగుతున్న‌ప్ప‌టికీ కొద్ది రోజుల నుండి ఫైమా. ప్రవీణ్ ని దూరం పెట్టిందట. ఈ విషయాన్ని ప్రవీణ్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆమెకు ఇష్టం అయితే కలిసి ఉండ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రం లేద‌ని ప్ర‌వీణ్ ఓ సందర్భంలో అన్నాడు. అయితే ఆ స‌మ‌యంలో ఫైమా ఏ మాత్రం స్పందించ‌లేదు. అయితే ఫైమా.. ప్ర‌వీణ్‌ని వ‌దిలేసి కొత్త ల‌వ‌ర్‌ని వెతుక్కున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ చిన్న హింట్ ఇవ్వ‌డంతో నెటిజ‌న్స్ రెచ్చిపోయారు. ఫైమా రీసెంట్‌గా జ‌బ‌ర్ధ‌స్త్‌కి రీఎంట్రీ ఇవ్వ‌గా, ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ టీంలో స్కిట్స్ చేస్తుంది. తాజా ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్ ఫైమాను ఉద్దేశిస్తూ… ‘లవర్స్ మార్చేసినంత ఈజీ కాదు అని కామెంట్ చేశాడు. దీనితో అంద‌రు కూడా ఫైమా.. ప్రవీణ్ కి హ్యాండ్ ఇచ్చి కొత్త లవర్ ని సెట్ చేసుకుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ కొత్త లవర్ ఎవరనేది మాత్రం ప్ర‌స్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇక ఫైమా విష‌యానికి వ‌స్తే కొన్నాళ్ల వ‌ర‌కు మాటీవీలో షోస్ చేస్తున్న ఫైమా ఇప్పుడు అక్క‌డ అగ్రిమెంట్ పూర్తి కావ‌డంతో జబర్దస్త్ కి రీఎంట్రీ ఇచ్చి తెగ సంద‌డి చేస్తుంది.