గరిక అంటే గణనాథుడికి ఎందుకంత ప్రీతి..? దాని వెనుకాల ఉన్న కథ ఇదే..!
గణనాథుడిని పూజించే ప్రతి భక్తుడు గరిక సమర్పిస్తుంటాడు. చాలా మంది భక్తులు గరిక లేకుంగా గణపతి ఆలయానికి వెళ్లారు. తమ వెంట గరిక తీసుకెళ్లి పూజిస్తుంటారు. ముక్కోటి దేవతల్లో ఒక్క గణనాథుడికే గరిక అంటే ఎందుకంత ప్రీతి..? అసలు దాని వెనుకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం..

గణనాథుడిని పూజించే ప్రతి భక్తుడు గరిక సమర్పిస్తుంటాడు. చాలా మంది భక్తులు గరిక లేకుంగా గణపతి ఆలయానికి వెళ్లారు. తమ వెంట గరిక తీసుకెళ్లి పూజిస్తుంటారు. ముక్కోటి దేవతల్లో ఒక్క గణనాథుడికే గరిక అంటే ఎందుకంత ప్రీతి..? అసలు దాని వెనుకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం..
పూర్వం యమ ధర్మరాజుకు అనలాసురుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ బాలుడు పుట్టుకతోనే అగ్నితత్వాన్ని కలిగి ఉంటాడు. దాంతో తనకు ఎదురుగా ఏది ఉన్న దాన్ని భస్మం చేసేవాడు. ఇక ముల్లోకాలు అల్లకల్లోలంగా మారాయి. ఈ క్రమంలో అనలాసురుడిని అంతం చేసేందుకు వినాయకుడు సిద్ధపడ్డాడు. తన తండ్రి మాదిరిగానే అతన్ని వినాయకుడు గుటుక్కున మింగేశాడు. ఆ తర్వాత వినాయకుడి ఉదర భాగంలో తీవ్రమైన తాపాన్ని కలిగించాడు అనలాసురుడు. గణనాథుడి ఉదరంలో తాపం తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి గరికతోనే తనకు ఉపశమనం కలుగుతుందని లంబోదరుడు భావించాడు. దీంతో తనను గరికతో కప్పమని దేవతలను కోరగా, వారు 21 గరికలను తీసుకొచ్చి ఆయన శరీరాన్ని కప్పారు. గరికలోని ఔషధ గుణాల కారణంగా వినాయకుడి తాపం తగ్గిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి వినాయకుడికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆయనకిష్టమైన గరికతో చవితి రోజు పూజించడం మొదలైంది. ఇప్పటికీ గరికలేనిదే వినాయక చవితి పూజ సంపూర్ణం కాదు. చాలా మంది భక్తులు 21 గరికలను తీసుకెళ్లి వినాయకుడికి పూజలు చేస్తారు.
వినాయకుడి అనుగ్రహం పొందాలంటే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునే వారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతి దేవుడిని పూజించాలి. ఆ దేవ దేవుడిని పూజించే సమయంలో ‘‘ఓం గ్లౌం గణపత్యే నమః’’ అనే మంత్రాన్ని జపించాలి. మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు వినాయకుడి ఆశీస్సులు మీపై శాశ్వతంగా ఉంటాయని పండితులు చెబుతారు.