Viral Video | జైల్లో గార్భా వేడుకలు.. దాండియాతో అదరగొట్టిన మహిళా ఖైదీలు

Viral Video | దసరా పండుగ నేపథ్యంలో దేవీ నవరాత్రులు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో గార్భా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సెంట్రల్ జైల్లో కూడా నవరాత్రులను పురస్కరించుకొని గార్భా వేడుకలను నిర్వహించారు. మహిళా ఖైదీలు దాండియా ఆడుతూ అందర్నీ మైమరిపించారు. మహిళా ఖైదీల దాండియాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గతేడాది కూడా ఇండోర్ సెంట్రల్ జైల్లో నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మహిళా ఖైదీలు గార్భా వేడుకల్లో పాల్గొంటున్నారు. దాండియా ఆడుతూ.. తమ కష్టాలను మరిచిపోతున్నారు. పండుగలను గొప్పగా నిర్వహిస్తున్న జైలు అధికారులకు మహిళా ఖైదీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Madhya Pradesh: Garba organised in Indore Central Jail on the occasion of #Navratri2023 pic.twitter.com/Y4pct1TL8x
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 20, 2023