దున్న‌పోతులా ఉన్నాడు.. ఎలా ఆడిస్తున్నారు అంటూ కెప్టెన్‌పై మాజీ క్రికెట‌ర్ ఫైర్

దున్న‌పోతులా ఉన్నాడు.. ఎలా ఆడిస్తున్నారు అంటూ కెప్టెన్‌పై మాజీ క్రికెట‌ర్ ఫైర్

ప్ర‌స్తుతం సౌతాఫ్రికా, భార‌త్ మ‌ధ్య తొలి టెస్ట్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత రెస్ట్‌లో ఉన్న చాలా మంది ఆట‌గాళ్లు ఈ టెస్ట్ మ్యాచ్‌తో తిరిగి జ‌ట్టులో చేరారు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమా ఇటీవ‌ల జ‌రిగిన టీ20, వ‌న్డేల‌కి దూరంగా ఉండి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే తొలి రోజు టెంబా బవుమా తీవ్రంగా గాయపడ్డాడు. భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బౌండ‌రిని ఆపే క్ర‌మంలో బవుమా తొడ కండరాల గాయం కావ‌డంతో అత‌ను మైదానాన్ని వీడాడు. నొప్పితో విలవిలలాడిన అతను మైదానం వీడ‌క త‌ప్ప‌లేదు. దాంతో కెరీర్‌లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ తాత్కలిక సారథిగా జట్టును ముంద‌కు న‌డిపిస్తున్నాడు.

ఇక బ‌వుమాకి తొడ కండ‌రాల గాయం కావ‌డంతో ఆయ‌న‌ని ఆసుప‌త్రికి పంపి స్కానింగ్ తీయించ‌గా, అత‌ని ఎడమ తొడ కండరాల్లో నరం పట్టేసినట్లు తేలింది. అతను మ్యాచ్ ఆడే విషయాన్ని వైద్యులు నిర్దారిస్థారని క్రికెట్ సౌతాఫ్రికా ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. అయితే బవుమాకి తొలి రోజే ఇలాంటి ఇబ్బంది త‌లెత్త‌డంతో మాజీ క్రికెట‌ర్స్ గిబ్స్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు బ‌వుమాపై ఫైర్ అవుతున్నారు. అస‌లు ఫిట్‌గా లేని వ్య‌క్తిని జ‌ట్టులోకి ఎలా తీసుకుంటార‌ని మండిప‌డుతున్నారు. హెర్షల్ గిబ్స్ త‌న ట్వీట్‌లో.. బవుమా అన్‌ఫిట్ ప్లేయరని, అధిక బరువతో బాధపడుతున్నాడని విమర్శలు గుప్పించాడు.2009లో సౌతాఫ్రికా ట్రైనర్‌గా ప్రారంభించి టీమ్ కోచ్‌గా మారిన వ్యక్తి అన్‌ఫిట్, అధిక బరువున్న ఆటగాళ్లను మ్యాచ్ ఆడించ‌డం హాస్యాస్పదంగా ఉంది.’అని హెర్షల్ గిబ్స్ ట్వీట్ చేశాడు.

ఇక బ‌వుమా మ్యాచ్ ఆడ‌డం కాస్త డౌట్‌గానే ఉంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భార‌త్ తొలుత బ్యాటింగ్ చేసింది. వ‌ర్షం అంత‌రాయం వ‌ల‌న మ్యాచ్ కేవ‌లం 59 ఓవ‌ర్స్ మాత్ర‌మే జ‌రిగింది. ఈ స‌మ‌యంలో భార‌త్ 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వర్షం కారణంగా చివరి సెషన్ ఆట సాధ్యం కాక‌పోవ‌డంతో, అంపైర్లు చివరి సెషన్ ఆటను రద్దు చేసి తొలి రోజును ముగించారు.ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 బ్యాటింగ్) విరోచిత ఇన్నింగ్స్‌‌కు అండగా విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.ఇక స‌ఫారీ బౌల‌ర్స్‌లో కగిసో రబడా(5/44), నండ్రే బర్గర్(2/50)కు తోడుగా మార్కో జాన్సెన్ ఓ వికెట్ ద‌క్కించుకున్నాడు.