Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల ధరలు గతంలో ఎన్నడూలేని విధంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బులియన్ మార్కెట్లో సోమవారం స్వల్పంగా ధరలు పతనమయ్యాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 తగ్గి తులానికి రూ.61,240 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడిపై రూ.10 తగ్గి తులానికి రూ.66,810కి చేరాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.61,840 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.67,460కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.61,240 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.66,810కి దిగజారింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.61,390 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.66,960కి చేరింది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.61,240 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,810 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర సైతం నిలకడగా కొనసాగుతున్నది. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి రూ.77,400 ధర పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,400కి తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.