Good news for the unemployed: నిరుద్యోగులకు భట్టి గుడ్‌న్యూస్.. రూ.6వేల కోట్లతో కొత్త స్కీం!
రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగులకు రూ.6000 కోట్ల నిధులతో రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీం అమలు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మార్చి 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని..5 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 31 మే 2025 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు.

Good news for the unemployed: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగులకు రూ.6000 కోట్ల నిధులతో రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీం అమలు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
మార్చి 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని..5 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 31 మే 2025 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. కార్పేరేషన్ల ద్వారా రాజీవ్ యువ వికాసం పథకం అమలవుతుందన్నారు. స్కీమ్ కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు.
స్వయం ఉపాధి కోరుకునే నిరుద్యోగులకు ఈ పథకం ఓ వరమని భట్టి చెప్పారు. కాగా కార్పోరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరీ గతం నుంచి కొనసాగుతున్నప్పటికి రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకంగా భట్టి పేర్కొనడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
రాజీవ్ యువ వికాసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన రాజీవ్ యువ కిరణాలను తలపించేదిగా ఉందన్నాయి.