తొలి రోజు గుంటూరు కారం క‌లెక్ష‌న్స్ ఎంత‌.. సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్టేనా?

తొలి రోజు గుంటూరు కారం క‌లెక్ష‌న్స్ ఎంత‌.. సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్టేనా?

అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది.గుంటూరు కారం సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్టార్స్, టెక్సిషియన్స్ రెమ్యూనరేషన్స్, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు తెలుస్తుంది. ఇక మూవీకి ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. దాదాపు 135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన గుంటూరు కారం తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింద‌నే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

గుంటూరు కారం సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా : 44.50 కోట్ల రూపాయలు, కర్ణాటక : 4.5 కోట్ల రూపాయలు, తమిళనాడు : 50 లక్షల రూపాయలు, మిగిన రాష్ట్రాల్లో : 50 లక్షల రూపాయలు,ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు రాబ‌ట్టిన‌ట్టు టాక్ న‌డుస్తుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 21 కోట్ల వ‌ర‌కు జ‌రిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 18 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి. నైజాంలో 10 కోట్లు కాగా..ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లో మ‌రో 18 వ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి.

గుంటూరు కారం సినిమాకి హైద‌రాబాద్‌లో ఆరు షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం, టికెట్ రేట్స్ వంద వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించ‌డం కాస్త ప్ల‌స్ అయింది. గుంటూరు కారం సినిమాకు భారీ క్రేజ్, బజ్ క్రియేట్ కావడంతో రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజాంలో 1050 స్క్రీన్లు, ఇండియా వైడ్‌గా ఇతర రాష్ట్రాల 150 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 850 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో గుంటూరు కారం సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత వసూల్ చేస్తుంది, మ‌హేష్ త‌న రికార్డులు తాను బ్రేక్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. విదేశాల్లో మాత్రం గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్న‌ట్టు స‌మాచారం.