29-03-2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి విప‌రీత‌మైన ఆర్థిక లాభాలు..!

మకర రాశి వారికి ఈరోజు అదృష్టం తలుపు తడుతుంది. కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ఆస్తి వ్యవహారాల ఒప్పందాలు చెయ్యడానికి ఇది సరైన రోజు. యాజమాన్యం నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా విపరీతమైన లాభాలు ఉంటాయి.

29-03-2024 శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి విప‌రీత‌మైన ఆర్థిక లాభాలు..!

మేషం

మేష రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజంతా ఆధ్యాత్మికంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మికంగా ఓ మెట్టుపైకి ఎక్కుతారు. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.

వృషభం

వృషభరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. గృహంలో శాంతి, సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు.

మిథునం

మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు వాయిదా పడటం చికాకు కల్గిస్తుంది. మీ సంతానం విషయంలో ఒకింత ఆందోళన నెలకొంటుంది. కానీ దైవబలంతో సాయంత్రానికి పరిస్థితులు చక్కబడి ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక లాభం ఉంటుంది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఈరోజు మీరు ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనులు వాయిదా పడటం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మీ తల్లి గారి ఆరోగ్యం క్షీణించవచ్చు. కొత్త పనులు మొదలు పెట్టడానికి సమయం అనుకూలంగా లేదు.

సింహం

సింహ రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా విజయం మీ వెంటే ఉంటుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటం మీకు నిరాశ కలిగిస్తుంది. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించాలి.

కన్య

కన్యా రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి లేదంటే గొడవలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు నష్టాలు తెచ్చి పెడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెద్దల సలహా తీసుకుంటే మేలు. హనుమాన్ ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

తుల

తులా రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో చేసే పనులు మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా మీరు సంతోషంగా ఉండేలా చేస్తాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో గొడవలు సద్దుమణిగిపోతాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి. కోర్టు వ్యవ్యహారాలు ఎటూ తేలక చికాకు కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.

ధనుస్సు

ధనస్సురాశి వారికి ఈరోజు చాలా గొప్పగా ఉంది. ఎటూ చూసినా లాభమే కనిపిస్తోంది. అదృష్టం వరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి.

మకరం

మకర రాశి వారికి ఈరోజు అదృష్టం తలుపు తడుతుంది. కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ఆస్తి వ్యవహారాల ఒప్పందాలు చెయ్యడానికి ఇది సరైన రోజు. యాజమాన్యం నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా విపరీతమైన లాభాలు ఉంటాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. పని ప్రదేశంలో అనుకూలంగా, ప్రశాంతంగానూ ఉంటుంది. ఇంట్లో శాంతి, సౌఖ్యాలు నెలకొంటాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

మీనం

మీన రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. సమయాన్ని వృథా చేయకుండా పని పట్ల శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను అందుకోగలరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.