మండుటెండలకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే గుండెకు ముప్పే..!
ఎండలు మండిపోతున్నాయి. గడప దాటి కాలు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే.. క్షణాల్లోనే డీహైడ్రేట్‌కు గురవుతారు. దీంతో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగేందుకు మొగ్గు చూపుతుంటారు.

ఎండలు మండిపోతున్నాయి. గడప దాటి కాలు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తే.. క్షణాల్లోనే డీహైడ్రేట్‌కు గురవుతారు. దీంతో చాలా మంది కూల్ డ్రింక్స్ తాగేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆ సమయానికి ఉపశమనం కలుగుతుంది. కానీ దీర్ఘకాలంగా అవి ప్రభావితం చూపుతాయి. స్వీట్ కలిగిన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గుండె సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్‌లోనే కాకుండా సోడాలు, పండ్ల రసాల్లో కూడా స్వీట్ ఉంటుంది. రుచి కోసం వీటిని తీసుకుంటుంటారు. అయితే చక్కెర ప్రభావంతో శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వారానికి రెండు లీటర్ల కంటే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే గుండె సమస్యలు 20 శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. స్వీట్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ తీసుకోవడం వల్ల గుండె వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటోందని అధ్యయనంలో వెల్లడైంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్‌లోని చక్కెరలు పేగుల్లోకి చొచ్చుకుపోయి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లేదంటే గుండె సమస్యలతో పాటు టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. వారానికి ఎక్కువ చక్కెర పానీయాలతో పాటు ధూమపానం అలవాటు ఉండేవారికి ఈ ప్రమాదం 31 శాతం ఎక్కువని తెలిపారు.
కాబట్టి చక్కెరలు కలిగిన కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉంటే మంచిది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు నీరు, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వాటర్ వంటివి తీసుకోవాలి. ఇవి మీరు హైడ్రేటెడ్‌గా, ఆరోగ్యంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.