కుర్చీ మడత పెట్టి సాంగ్‌కి జపాన్ కపుల్ ఇచ్చి పడేశారుగా.. సేమ్ ట సేమ్ దింపేశారు..!

కుర్చీ తాత గురించి.. కుర్చీ మడత పెట్టి.. డైలాగ్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుర్చీ తాత చెప్పిన కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఫుల్ ఫేమస్ కావడంతో దానిని ఏకంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో వాడేశారు. ఆ డైలాగ్‌తో పాటని క్రియేట్ చేయడమే కాదు, రికార్డ్ క్రియేట్ అయ్యేలా చేశారు. యూట్యూబ్‌లోకి వచ్చిన గంటలోనే లక్ష వ్యూస్ తెచ్చుకున్న ఈ సాంగ్ రికార్డులు తిరగరాస్తుంది. థమన్ కొట్టిన బీట్స్‌కు, ఆ పాట లిరిక్స్ అద్భుతంగా సెట్ కావడంతో ప్రతి ఒక్కరు మైకంలో మునిగి తేలారు. ఇప్పుడు ఈ మాస్ సాంగ్ జనాల్ని ఉర్రూతలూగిస్తుంది. మన దగ్గరే కాదు విదేశాలలో కూడా ఈ పాట దుమ్ము రేపుతుంది.
ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకోగా ఇప్పుడు గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ని తెగ ఉత్సాహపరుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల కొందరు ఫారినర్స్ తమ జిమ్ వర్క్ అవుట్స్ కోసం ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ని ఉపయోగించుకుంటూ కసరత్తులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక ఆ వీడియోపై మహేష్ బాబు కూడా స్పందించాడు. ఇక ఇప్పుడు ఓ జపాన్ జంట గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్స్ ని రీ క్రియేట్ చేస్తూ చేస్తూ అదరహో అనిపించారు.
ఈ మాస్ సాంగ్ కి జపాన్ జంట వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మహేష్ బాబు, శ్రీలీల మాదిరి ఆ జపాన్ జంట చేసిన డ్యాన్స్ ఒక్కొక్కరికి పూనకాలు తెప్పిస్తుంది. నిజంగా వారి డ్యాన్స్ అదరహో అనిపించేలా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు ‘భారతి’ కూడా ఈ పాటకి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసింది. బాబాయ్ పాటకి భారతి గ్రేస్‌తో ఊరమస్ గా స్టెప్పులు వేయగా,దానికి సితార కూడా ఫిదా అయింది. వావ్ గార్జియస్ ఉమెన్ అంటూ తెగ సంబరపడిపోయింది సితార.