మూవీ లవర్స్‌కి పెద్ద షాక్.. థియేటర్ ఓనర్స్ సంచలన నిర్ణయంతో సినిమా రిలీజులపై నిషేదం

ఇటీవల చాలా మంది తమ పనులతో నిత్యం క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయారు. అయితే ఎప్పుడన్నా కాస్త రిలక్సేషన్ కోసం ఫ్యామిలీతో సినిమాకి వెళ్లి ఆనందం పొందుతున్నారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు ఓటీటీలోను సినిమాలు సందడి చేస్తుండగా, వాటిని చాలానే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మూవీ లవర్స్‌కి మాత్రం ఇప్పుడు ఈ వార్త పెద్ద షాకింగ్ అని చెప్పాలి. అందుకు కారణం ఫిబ్రవరి 22 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమంటూ మూవీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకోవడమే. వారు తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో థియేటర్స్‌లో మూవీలు రిలీజ్ కావడం కష్టమే..
అయితే తెలుగు సినీ ప్రియులు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఈ నిషేదం కేరళలో మాత్రమే. కేరళలో థియేటర్ల ఓనర్స్ కు నిర్మాతలకు మధ్యగత రెండేళ్లుగా గొడవలు జరుగుతుండగా, ఈ వివాదం మరింత ముదరడంతో ఫిబ్రవరి 22 నుండి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను రిలీజ్ చేయబోమని ప్రకటించింది. మలయాళ సినిమాలను ప్రదర్శించకూడదని కేరళ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ కూడా సందిగ్ధంలో పడింది. అయితే ఈ వివాదం ఏంటనేది చూస్తే.. ఓటీటీ సినిమా రిలీజుల విషయంలో కేరళ థియేటర్ల ఓనర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్లోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని వారి డిమాండ్ .
ఈ విషయంలో అసోసియేషన్ ఓ నిబంధన కూడా తీసుకు రాగా, ఆ రూల్‌ని కొందరు నిర్మాతలు తుంగలో తొక్కుతున్నారు. దీంతో అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజులలో కొన్ని పెద్ద సినిమాలు విడుదల కానుండగా, వాటి పరిస్థితి ఏంటని అందరు సందిగ్ధంలో పడ్డారు. మోహన్ లాల్ నటించిన ‘మలైకొట్టై వాలిబన్’ మూవీ కొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ రావడమే థియేటర్స్ యజమానుల కోపానికి కారణమైందని కొందరు అంటున్నారు. మరి ఈ వివాదం మరింత ముదురుతుందా, లేదంటే చర్చల ద్వారా దీనికి ఎండ్ కార్డ్ వేస్తారా అనేది చూడాల్సి ఉంది.