భారత మార్కెట్‌లోకి కియా ఈవీ9 ఎస్‌యూవీ! లాంచ్ డేట్.. ఫీచర్స్ ఇవే..!
కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

Kia EV9 India | దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా భారత్‌ల మార్కెట్‌పై ఫోక్ చేసింది. ఇటీవల కాలంలో వాహనదారులందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతుండటంతో ఈవీ వాహనాలపై కియా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా అత్యధికంగా విక్రయమవుతున్న ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది ఈవీ9ని భారత్‌లోనే లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ గతేడాది ప్రకటించింది.
తాజాగా ఇందుకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. కొత్త ఈవీ భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్‌లో కనిపించింది. ఈ ఎస్‌యూవీ ఫీచర్స్, ధర తదితర వివరాల గురించి వాహనదారులు ఆరా తీస్తున్నారు. కియా ఈవీ9 ప్రీమియం కారు కాగా.. ఇందులో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఫ్లష్ ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అలాగే ఇందులో 21 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్ ఉన్నాయి. ఈ 3రో ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెహికిల్ ఇంటీరియర్ చాలా స్పేషియస్గా, డిజైన్ మినిమలిస్ట్‌గా ఉండనున్నది. ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, పానారోమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కోసం భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఈవీ9 ఎస్‌యూవీని కియా రూపొందించింది. ఈవీ9లో అంతర్జాతీయంగా రెండు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి 76.1 కేడబ్లూహెచ్ కాగా.. రెండోది 99.8 కేడబ్ల్యూహెచ్. ఈ ఎస్‌యూవీ రేంజ్ 540 కిలోమీటర్లు కాగా.. 800 వోల్ట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
అయితే, భారత్‌లోనూ ఇదే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుందా? ఇందులో ఏమైనా మార్పులు చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ధర మాత్రం తెలియరాలేదు. ప్రీమియం కారు కావడంతో ఎక్స్‌షోరూం ధర రూ.40లక్షలకుపైగానే ఉంటుందని అంచనా. టెస్ట్ డ్రైవ్‌లో ఉండగా.. ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందనేది తెలియరాలేదు. త్వరలోనే కంపెనీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నది. అయితే, కియా కంపెనీ గతేడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈవీ9 ఎస్‌యూవీని ప్రదర్శించింది. అప్పటి నుంచి మోడల్‌పై ఆసక్తి పెరిగింది. 2025లో మోడల్ చేస్తామని చెప్పిన కంపెనీ ముందస్తుగానే తీసుకువచ్చింది. ఈవీలో టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఈవీలో 15శాతం వాటా దక్కించుకోవాలని కియా భావిస్తున్నది. ఇందులో భారత్‌లో వరుసగా ఈవీ మోడల్స్‌ను తీసుకురావాలని యోచిస్తున్నది.