కేఎల్ రాహుల్ వెడ్డింగ్ వీడియో ఔట్.. సినిమాటిక్ లెవల్‌లో ఉందిగా..!

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ గత ఏడాది జనవరి 23న పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. చాలా సింపుల్‌గా కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టితో ప్రేమలో ఉన్న రాహుల్ ఎట్టకేలకి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 23తో వారి వివాహం జరిగి ఏడాది పూర్తి కావడంతో మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ఈ వీడియోలో మెహందీ వేడుక, సంగీత్ కార్యక్రమంతో పాటు వైభంగా జరిగిన పెళ్లి వీడియో క్లిప్స్ ఉన్నాయి. సినిమాటిక్ స్టైల్‌లో ఈ వీడియో ఉంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రాహుల్, అతియా ప్రేమలో ఉన్నట్లు 2019 నుంచే వార్తలు వచ్చిన వాటిని వారిద్దరు కొట్టిపారేశారు. ఆ తర్వాత పబ్లిక్‌గా ఓపెన్ అయిన తర్వాత ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అంతేకాదు అతియా టీమిండియా పర్యటనల సమయంలో రాహుల్‌తోనే ఉంది. ఐపీఎల్‌కి కూడా అతనితోనే కనిపించింది. ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. యానివర్సరీ పూర్తైన సందర్భంగా జూనియర్ రాహుల్ ఎప్పుడు వస్తాడు అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. సౌతాఫ్రికా టూర్లో టెస్ట్ సిరీస్ లోనూ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ను ఇంగ్లండ్ తో సిరీస్ లో మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్ గానే తీసుకున్నట్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.
ఇప్పుడు కీపింగ్ బాధ్యతలు లేకపోవడంతో రాహుల్ తన బ్యాటింగ్ పైనే దృష్టిసారించే వీలు కలిగింది. ప్రస్తుతం రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ గాయపడిన తర్వాత కొంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నాడు. కాని తర్వాత ఆటపై పూర్తిగా దృష్టి పెట్టి మంచి స్కోర్స్ చేస్తున్నాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై అజేయ శతకం (111*) సాధించిన రాహుల్ ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పరుగుల వరద పారించాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 75 సగటుతో 452 పరుగులు చేశాడు. ఇటీవల బలమైన దక్షిణాఫ్రికా పేసర్లను కఠిక పిచ్‌పై సమర్థంగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్ (101) వీరోచితక శతకం సాధించాడు.