క్లింకార వచ్చిన వేళా విశేషం.. మెగా ఫ్యామిలీకి అవార్డుల పంట

పెళ్లైన పదకొండేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి క్లింకార అనే నామకరణం చేశారు. ఇక పుట్టినప్పటి నుండి పాప ఫేస్ బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా ఫ్యామిలీ. అయితే ఇప్పటికీ క్లింకారకి ఎవరి పోలికలు వచ్చాయి, క్లింకార ఎంట్రీతో మెగా ఫ్యామిలీకి అదృష్టం మరింత కలిసొస్తుందా అనే చర్చలు నడుస్తున్నాయి. అయితే క్లింకార పుట్టినప్పటి నుండి మెగా ఫ్యామిలీకి అవార్డులు క్యూ కడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్లింకార అలా పుట్టిన వెంటనే చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు రెండు ఆస్కార్లు వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఆస్కార్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, అది చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో సాధ్యం కావడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా కూడా ఎదిగాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనని చాలా మంది ప్రశంసించారు.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్‌కి ఎన్నో సత్కారాలు కూడా జరిగాయి. ఏకంగా ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా కూడా ప్లేస్ కొట్టేశాడు. అయితే స్వయంకృషితో చరణ్‌కి అంతర్జాతీయంగా పేరు దక్కిన కూడా చాలా మంది ఇది మెగా మనవరాలు వచ్చిన వేళావిశేషం అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు కూడా టాలీవుడ్ కు చెందిన నటుడు ఎవరు బెస్ట్ హీరో క్యాటగిరీలో అవార్డ్ రాలేదు.. ఇన్నేళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటి సారిగా ఉత్తమ నటుడు క్యాటగిరీలో జాతీయ అవార్డ్ సాధించి సత్తా చాటాడు బన్నీ. ఈ విషయంలో కూడా క్లింకార లక్కీ లెగ్ పని చేసిందని అంటున్నారు.
ఇక క్లింకార రాక తర్వాత వరుణ్ తేజ్ వివాహం జరిగింది. వారింట ఆనందం వెల్లివిరిస్తుంది. ఇలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండోవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణుడి అవార్డ్‌కి ఎంపికయ్యారు. ఇది కూడా క్లింకార వచ్చిన వేళా విశేషమనే కొందరు అంటున్నారు. క్లింకార మెగా ఫ్యామిలీ అదృష్ట దేవత అని, ఆమె రాకతో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలలో ప్రభంజనం సృష్టిస్తాడని కొందరు జోస్యం చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!