మునుగోడు TRS అభ్యర్థిగా కూసుకుంట్ల.. ప్రకటించిన CM KCR
విధాత: మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మునుగోడు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లాంటి సీనియర్ నేతలు యత్నించినప్పటికీ విస్తృత చర్చల అనంతరం కేసీఆర్ కూసుకుంట్ల వైపే మొగ్గుచూపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీ […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మునుగోడు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లాంటి సీనియర్ నేతలు యత్నించినప్పటికీ విస్తృత చర్చల అనంతరం కేసీఆర్ కూసుకుంట్ల వైపే మొగ్గుచూపారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి స్రవంతిని తమ అభ్యర్థులుగా ఆయా పార్టీ ప్రకటించారు. అధికారపార్టీ అభ్యర్థి ఎవరనేది కొంత కాలంగా సస్సెన్స్ కొనసాగుతున్నది.
మొన్న దసరా రోజునే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకున్నా చేయలేదు. ఎట్టకేలకు సస్సెన్స్‌కు తెర దించుతూ కేసీఆర్ కూసుకుంట్ల పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించారు.
నేటి నుంచి మనుగోడు ఉప ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్, 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక ప్రచారం ఊపందుకోనున్నది.