కొత్త ఏడాదిలో నాజూకు పోజుల‌తో బేబ‌మ్మ విధ్వంసం.. ఇలా ఊహించ‌లేదుగా..!

కొత్త ఏడాదిలో నాజూకు పోజుల‌తో బేబ‌మ్మ విధ్వంసం.. ఇలా ఊహించ‌లేదుగా..!

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంతో తిరుగులేని విజయం దక్కించుకుంది. ఇందులో బేబ‌మ్మ లుక్‌కి కుర్రాళ్లు చిత్తైపోయారు. ఆమె టాలీవుడ్ సినీ ప్రియుల‌కి క్ర‌ష్‌గా మారింది. ఉప్పెన త‌ర్వాత కృతికి వ‌రుస ఆఫ‌ర్స్ ప‌ల‌క‌రించ‌గా, అందులో శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలు చేసింది. అయితే బంగార్రాజు వ‌ర‌కు కృతికి మంచి విజ‌యాలు ద‌క్కాయి. త‌ర్వాత మాత్రం వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి.

చివ‌రిగా నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రం కూడా కృతికి తీవ్ర‌మైన నిరాశ‌మిగిల్చింది. అందం ఉండి మంచి టాలెంట్ ఉన్నా కూడా స‌రైన అదృష్టం లేక‌పోవ‌డంతో కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది. అయితే కొత్త సంవ‌త్స‌రం కృతి శెట్టి ఫేట్ మారుతుంద‌ని ఆమె అభిమానులు భావిస్తున్నారు. కృతి చేతిలో శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మలయాళంలో అజయంతే రాండాం మోషనం అనే సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లకు పైగానే ఉంది. ఈ చిత్రం కృతికి మంచి పేరు తెస్తుంద‌ని భావిస్తున్నారు.

అయితే కెరీర్ మొద‌ట్లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన కృతి శెట్టి ఇప్పుడు ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్ పెంచేసారు .. కొత్త సంవత్సరంలో కృతి శెట్టి తన లుక్ కూడా పూర్తి గా మార్చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. నాజూగ్గా మారిన ఈ అందాల ముద్దుగుమ్మ నడుము సొగసు, క్లీవేజ్ , పెద‌వులు, నాభి అందాలు ఇలా అన్ని యాంగిల్స్ లో పరువాలు వెదజల్లుతూ విరహం భరించలేనట్లుగా ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. బ్యూటీ అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు. అమ్మ‌డి అందాల‌కి త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. ప్ర‌స్తుతం కృతి క్యూట్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.