నిహారిక‌కి ఆడ‌ప‌డుచు క‌ట్నం ఇచ్చారా..కొత్త కోడ‌లు ఇచ్చిన స‌మాధానం ఏంటంటే…!

నిహారిక‌కి ఆడ‌ప‌డుచు క‌ట్నం ఇచ్చారా..కొత్త కోడ‌లు ఇచ్చిన స‌మాధానం ఏంటంటే…!

మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. గతేడాది నవంబర్ ఒకటో తేదీన తన ప్రియుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. కొణిదెల కుటుంబానికి రెండో కోడలిగా మారింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే కొన్ని షాకింగ్ కామెంట్లు చేస్తుంది.లావణ్య త్రిపాఠి వర్సెస్ మెగా కోడలు ఇందులో మీకు ఏ ట్యాగ్ అనేది ఇష్టం అని ఓ విలేకరి ప్రశ్న అడ‌గ‌గా, లావణ్య త్రిపాఠి అనేది తాను కష్టపడి సంపాదించుకున్న పేరు అని… మెగా కోడలు అనే ట్యాగ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పుకొచ్చింది.

ఇక పర్ఫెక్షన్ అనేది పెద్ద సమస్య అని… దీని వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని కూడా లావ‌ణ్య పేర్కొంది. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని… వరుణ్ మాత్రం పర్ఫెక్షనిస్ట్ అని చెప్పారు. పెళ్లి అయిన తర్వాత తన సినిమాల విషయంలో అత్తారింట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని , కెరీర్ పరంగా అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని తెలిపారు. మంచి కథ దొరికితే వరణ్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇక మీరు నిహారికతో చాలా క్లోజ్‌గా ఉంటారు కదా.. పెళ్లిలో ఆమెకు ఏమైనా ఆడపడుచు కట్నం ఇచ్చారా? అని ప్రశ్నించ‌గా, దానికి స్పందిస్తూ.. నిహారికకు కట్నం, కానుకలు అంటూ ఏం ఇవ్వలేదు. డబ్బులు కూడా ఏం ఇవ్వలేదు. అసలు తను నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అయితే తను ఫ్యామిలీ మెంబర్‌ కాబట్టి నిహా కోసం ఏదైనా చేస్తా అని పేర్కొంది.

నిహారిక‌కి అవసరమైనప్పుడు ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటా. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా బిజీగా ఉంది కాబ‌ట్టి మంచి కథ వస్తే నిహారిక బ్యానర్లో నటిస్తాను. మేం ఒకటే ఫ్యామిలీ కాబట్టి తన నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్‌ తీసుకోను అని కొత్త కోడ‌లు పేర్కొంది. ప్రస్తుతం లావణ్య కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. కాగా పెళ్లికి ముందు నుంచి నిహారిక-లావణ్యలు మంచి ఫ్రెండ్స్ కాగా, వ‌రుణ్ తేజ్ ప్రేమ, పెళ్లి విష‌యంలో నిహారిక చాలా సాయం చేసింది.ఇక వ‌దిన త‌న‌తో మంచి స్నేహంగా ఉంటుంద‌ని, ప‌లు సూచ‌న‌లు కూడా చేస్తుంద‌ని ఇటీవ‌ల నిహారిక పేర్కొంది. ఇక లావ‌ణ్య వెబ్ సిరీస్ విష‌యానికి వ‌స్తే మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ఫిబ్ర‌వ‌రి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.