కోట్ల ప్రాపర్టీపై కన్నేసిన మహేష్ బాబు.. ఆయన ప్లానింగ్ చూసి బిత్తరపోతున్న తోటి హీరోలు

కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం రాజమౌళి మూవీతో బిజీగా ఉండగా, ఈ మూవీ కోసం ఇటీవల జర్మనీ వెళ్లొచ్చారు. చిత్రంలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం మహేష్ పలు కసరత్తులు కూడా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. అయితే మహేష్ బాబు ఒకవైపు రాజమౌళి సినిమాతో బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్స్ కూడా చేస్తున్నాడు. రీసెంట్‌గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాడ్‌లో పాల్గొన్నాడు.
అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే మహేష్ ఇప్పటి వరకు 25 యాడ్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్, థియేటర్లు, రెస్టారెంట్ బిజినెస్‌లు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే తన సంపాదనలో కొంత భాగాన్ని మహేష్ బాబు సేవా కార్యక్రమాలకి కూడా వినియోగిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు మహేష్ చాలా మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి మనసు చాటుకున్నాడు సూపర్ స్టార్. తాజాగా మహేష్ బాబుకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. హైదరాబాద్ శివార్లలో 2.5 ఎకరాల భూమిని మహేష్ బాబు కొనుగోలు చేశారని, దాని విలువ 50 కోట్లకి పైగా ఉంటుందని టాక్.
సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా భూమి మీద మహేష్ బాబు ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. హీరోగా మాత్రమే కాకుండా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా మహేష్ బాబు దూసుకుపోతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల క్రాస్ రోడ్‌లో ఆయన థియేటర్ కన్‌స్ట్రక్షన్ చేయించనున్నట్టు ప్రచారం జరిగింది. మహేష్ బాబు ఇటీవల తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. రాజమౌళితో సినిమా కోసం ఆయన వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు టాక్. మొత్తం మీద సినిమాలు, బిజినెస్ ల ద్వారా సంపాదిస్తూ మహేష్ కరోడ్ పతిగా మారుతుండడం ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది.