శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే.. అందరి ముందు మహేష్ షాకింగ్ కామెంట్స్
శ్రీలీల నటన అద్భుతం అంటూ ప్రశంసించిన మహేష్ బాబు ఆమెతో డాన్స్ అంటే.. అమ్మో.. హీరోల తాట ఊడిపోతుంది అంటూ నవ్వులు పూయించారు

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లామర్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గుంటూరులో జరిగింది. ఈవెంట్ లో మహేష్ క్యూట్ లుక్ లో కనిపించి సందడి చేశారు. చెక్ షర్ట్ లో మెరిసిన మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఉన్నప్పుడు ప్రతి సారి తన సినిమాల గురించి మాట్లాడేవారని.. రివ్యూ ఇచ్చేవారని.. కాని ఇప్పుడు నాకు తల్లీ తండ్రీ.. అన్నీ మీరే.. అంటూ ఎమోషనల్ కామెంట్ చేశారు. అంతే కాదు ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఆదరించండి అంటూ చేతులెత్తి దండం పెట్టారు మహేష్ బాబు.
మీరే నాకు అమ్మ,నాన్న అన్నీ అంటూ కూడా మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్రివిక్రమ్ నా కుటుంబ సభ్యులు లాంటి వారు. ఆయన గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు.. ఎందుకంటే..ఫ్యామిలీ మెంబర్ గురించి ఏం మాట్లాడుతాం.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కవే అని ప్రశంసించారు. ఇక శ్రీలీల నటన అద్భుతం అంటూ ప్రశంసించిన మహేష్ బాబు ఆమెతో డాన్స్ అంటే.. అమ్మో.. హీరోల తాట ఊడిపోతుంది అంటూ నవ్వులు పూయించారు.సాధారణంగా మహేష్ బాబు ఈవెంట్స్ లో తన హీరోయిన్స్ పేరు మరచిపోతాడనే టాక్ ఉంది. అందుకే శ్రీలీల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు… మర్చిపోలేదు కంగారు పడకు అంటూ నవ్వులు పూయించాడు మహేష్‌బాబు.
మరో పాత్రలో నటించిన మీనాక్షి గురించి చెబుతూ, ఆమెది గెస్ట్ రోల్ అని , నీతో పనిచేయడం ఆనందంగా ఉందని, అడగ్గానే చిన్న రోల్ అయిన చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అలాగే చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు సొంత బ్రదర్ లాంటివాడని తెలిపారు మహేష్. త్రివిక్రమ్ గారు నాతో చేసిన ప్రతి సినిమాలో మ్యాజిక్ చేశారు. `అతడు` నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాలో, అలాగే `ఖలేజా`లో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు `గుంటూరు కారం`లో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్‌బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం` అని చెప్పారు మహేష్.