Health Tips | బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..? అయితే పాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తాగండి..!

Health Tips | బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..? అయితే పాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తాగండి..!

Health Tips | బ‌రువు త‌గ్గేందుకు ఎన్నో క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. వ్యాయామం నుంచి మొద‌లుకుంటే మ‌నం తీసుకునే ఆహారం వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. అలా ప్ర‌తిరోజు వ్యాయామం చేస్తాం. కొవ్వు ఉండే ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉంటాం. రాత్రిపూట తిన‌డం మానేస్తాం. ఇక పాల‌కు దూరంగా ఉంటారు. ఇలా డైట్ మెయింటెన్ చేస్తారు. కానీ బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు పాల‌ను క‌చ్చితంగా తాగాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.బ‌రువు త‌గ్గాల‌నుకున్న‌ప్పుడు పాల వినియోగం త‌గ్గించాల‌నేది కేవ‌లం అపోహ మాత్ర‌మే అని అంటున్నారు. కొవ్వు శాతం త‌క్కువ‌గా ఉండే పాల‌ను తాగ‌డం వ‌ల్ల కాల్షియం, విట‌మిన్ డీ, ప్రోటీన్లు వంటి పోష‌కాలు శ‌రీరానికి అందుతాయి. శ‌రీరం ధృఢంగా మారి బ‌రువు త‌గ్గే అవ‌కాశం ఉంది.

  • చాలా మంది పాల‌ను దూరంగా పెట్టి.. సోడా, టీ, ఎన‌ర్జీ డ్రింక్స్ తాగేస్తుంటారు. అయితే ఈ డ్రింక్స్ వ‌ల్ల శ‌రీరానికి న‌ష్టం క‌లుగుతుంది. పాల‌లో ప్రోటీన్ కంటెంట్ కార‌ణంగా క‌డుపు నిండిన అనుభూతి క‌లుగుతుంది. దీంతో చిరుతిండ్ల‌కు దూరంగా ఉంటారు. త‌ద్వారా బ‌రువు త‌గ్గే అవ‌కాశం ఉంది.
  • ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌మ్రం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. కొంద‌రు జిమ్‌కు కూడా వెళ్తుంటారు. స‌డెన్‌గా జిమ్ ఆపేస్తే కూడా బ‌రువు పెరుగుతారు. శ‌రీరంలోని కొవ్వును త‌గ్గించుకునేందుకు వ్యాయామం చేస్తారు. అయితే శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు ఇవ్వ‌కుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది.
  • బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. కేల‌రీలు త‌గ్గించుకోవ‌డం చాలా ముఖ్యం. కానీ శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కేల‌రీలు మాత్రం క‌చ్చితంగా అందించాలి. అయితే పాలు తీసుకునే స‌మ‌యంలో కేల‌రీలు గురించి కొన్ని విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కేల‌రీలు త‌క్కువ‌గా ఉండే పాలు తీసుకోవాలి.
  • సోయా పాల‌ను తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఈ పాలు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయం చేస్తాయి.
  • బరువు తగ్గాలనుకునేవారు ఏ రకమైన పాలను ఎంచుకున్నా సరే కానీ.. దానిని మితంగా తాగాలి. బరువును తగ్గిస్తాది కదా అని ఎక్కువ తాగకూడదు. అలాగే హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి దానిని ఇతర పానీయాలతో భర్తీ చేయకుండా.. నీరు బాగా తాగండి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచడానికి సహాయం చేస్తుంది. బరువు తగ్గడానికే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిది.