మరోసారి ట్రోలర్స్‌కి మంచి స్టఫ్ ఇచ్చిన మంచక్క.. ఓ రేంజ్లో ఆడుకుంటున్నారుగా..!

నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు సినిమాలతో వార్తలలో నిలిచిన ఈవిడ ఇప్పుడు ట్రోలింగ్‌తో హాట్ టాపిక్ అవుతుంది. మంచక్క ఏం చేసినా, ఏం మాట్లాడిన తెగ ట్రెండ్ అవుతుంటుంది. ముఖ్యంగా ఆమె మాట్లాడే ఇంగ్లీష్ భాషపై ఎంత ట్రోల్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తూ కూడా విమర్శల బారిన పడుతూ ఉంటుంది. అయితే మంచు లక్ష్మీని ఎవరు ఎంత విమర్శించిన కూడా ఈవిడ మాత్రం తాను అనుకున్నది చేసి తీరుతూనే ఉంటుంది. ఇటీవల మంచు లక్ష్మీ ల్యాప్ టాప్ లో రామయ్య వీడియో పెట్టి ల్యాప్ టాప్ కు పూజు చేసింది. దాని ముందే ఓ దీపం పెట్టి ల్యాప్ టాప్ పై పూలు చల్లుతూ స్పెషల్ పూజ చేసి చివర్లో జై శ్రీరామ్ అని అరిసింది.
మంచు లక్ష్మీ చేసిన ఈ పూజ స్టైల్ కు తెగ ట్రోల్ చేశారు. ఇక తాజాగా ఆమె ఓ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఇందులో అమ్మడి హావభావాలు విచిత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె నోరు తెరచి పెదాలు ప్రదర్శించిన తీరు నచ్చలేదట. నోరు మూసుకో అని ఒక నెటిజన్ కామెంట్ ఫైర్ కాగా… మోడల్ మాదిరి నువ్వు అలా నోరు తెరిస్తే దరిద్రంగా ఉందంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఎవరు ఎన్ని అన్నా కూడా మంచు లక్ష్మీ మాత్రం ఫొటో షూట్స్ విషయంలో తగ్గేదే లే అంటుంది. తను నచ్చిన స్టైల్లో ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మంచు లక్ష్మి ఈ నెగిటివిటీ, ట్రోలింగ్ అసలు పట్టించుకోదు.
ప్రస్తుతం మంచక్క ముంబైలో మకాం వేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సెలెబ్స్ తో పార్టీలు గట్రా ఎంజాయ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం అగ్ని పర్వతం అనే లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి.. తనకు సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ , సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది.ఆమెని ఇష్టపడేవారు కొందరైతే ద్వేషించే వారు మరి కొందరు. ఏదేమైన మంచక్క డేరింగ్ అండ్ డాషింగ్ అనే చెప్పాలి.