ఎంత సంపాదించినా డ‌బ్బు మిగ‌లట్లేదా..? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!

ఎంత సంపాదించిన డ‌బ్బు మిగ‌ల‌కుండా, ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అయిపోతుంటుంది. ఆ ప‌రిస్థితులు త‌లెత్త‌డానికి కార‌ణం.. ఇంట్లో న‌గ‌ద‌ను స‌రైన స్థ‌లంలో ఉంచ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఎంత సంపాదించినా డ‌బ్బు మిగ‌లట్లేదా..? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!

ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో ప్ర‌తి ఒక్క‌రూ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటారు. నిత్యం చెమ‌టోడ్చుతూ రూపాయికి రూపాయి వెనుకేసుకుంటారు. కానీ ఎంత సంపాదించిన డ‌బ్బు మిగ‌ల‌కుండా, ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అయిపోతుంటుంది. ఆ ప‌రిస్థితులు త‌లెత్త‌డానికి కార‌ణం.. ఇంట్లో న‌గ‌ద‌ను స‌రైన స్థ‌లంలో ఉంచ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం..

ఆ ప‌త్రాల‌తో క‌లిపి డ‌బ్బును ఉంచొద్దు..

ప్ర‌తి ఇంట్లో బీరువా ఉంటుంది. ఇక ఆ బీరువాలోనే ఆస్తుల‌కు సంబంధించిన ప‌త్రాలు, ఇత‌ర విలువైన వస్తువుల‌తో పాటు డ‌బ్బును కూడా ఉంచుతారు. కుటుంబ వివాదాల‌కు సంబంధించిన ఇత‌ర ప‌త్రాల‌ను అక్క‌డే ఉంచుతారు. అయితే ఇది డ‌బ్బుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్ర‌కారం ఇలాంటి ప‌త్రాల‌ను ఉంచిన చోట డ‌బ్బును నిల్వ చేయ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. దీని కార‌ణంగానే అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుల‌కు ప‌రిస్థితులు దారి తీస్తున్నాయ‌ని పేర్కొంటున్నారు.

రంగు కూడా ముఖ్య‌మే..

ఇక డ‌బ్బులు దాచే డ‌బ్బాలు కూడా ముఖ్య‌మే అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది బీరువాలో కాకుండా డ‌బ్బాల్లో న‌గ‌దు దాచేస్తుంటారు. వాస్తు ప్ర‌కారం.. మెటాలిక్ రంగు బీరువాలో డ‌బ్బు ఉంచితే శుభ‌ప్ర‌ద‌మ‌ని పండితులు చెబుతున్నారు. అలాగే మెట‌ల్, గోల్డ్ లేదా లేత బూడిద రంగు క‌లిగిన బీరువాల‌ను ఎంచుకోవ‌డం ఉత్త‌మం అంటున్నారు. ఇక న‌లుపు, ముదురు ఎరుపు రంగులో బీరువాల‌కు, డ‌బ్బాల‌కు దూరంగా ఉంటేనే మంచిద‌ని సూచిస్తున్నారు. అందుకే డ‌బ్బును కూడ‌బెట్టాల‌నుకునే వారు రంగు విష‌యంలో కూడా జాగ్ర‌త్త వ‌హించాల‌ని చెబుతున్నారు.

చిరిగిన నోట్ల‌ను మార్పిడి చేసుకుంటే బెట‌ర్..

చాలా మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. చిరిగిన నోట్లను కూడా బీరువాలో దాస్తుంటారు. కానీ.. వాస్తుప్రకారం పొదుపు చేసే డబ్బుతో కలిపి పాత, చిరిగిన నోట్లను ఉంచడం మంచిది కాదంటున్నారు వాస్తుపండితులు. ఇది కూడా డబ్బు నిల్వకపోవడానికి కారణం కావొచ్చంటున్నారు. కాబట్టి, మీ దగ్గర అలాంటి చిరిగిన నోట్లు ఉంటే వాటిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. లేదా బ్యాంకుకు వెళ్లి ఆ నోట్లను మార్పిడి చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

బీరువా ఉత్త‌రం వైపు ఉండాలి..

మీరు బీరువాలో డబ్బు నిల్వ చేస్తున్నట్లయితే వాస్తుప్రకారం అది ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలట. అలాగే దానికి ఎదురుగా టాయిలెట్ డోర్ ఉండకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. వాస్తుప్రకారం ఇలా ఉండడం అస్సలు మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు.