ప్ర‌భాస్ క‌ల్కిలో ఎన్టీఆర్..ఏంటి ఆ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించ‌బోతున్నాడా..!

ప్ర‌భాస్ క‌ల్కిలో ఎన్టీఆర్..ఏంటి ఆ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించ‌బోతున్నాడా..!

రానున్న రోజుల‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. పాన్ ఇండియా చిత్రాలుగా అవి రూపొందుతుండ‌గా వాటిలో ప్ర‌భాస్ న‌టిస్తున్న క‌ల్కి ఒక‌టి. ఈ సినిమా గ‌త కొద్ది రోజులుగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతుండ‌గా, సి. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణెతోపాటు సెక్సీ భామ దిశా పటానీ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని సుమారు రూ. 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండ‌గా, ఇందులో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

చిత్రానికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీలో కొందరు పాపులర్ హీరోలు గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వ‌నున్న‌ట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కల్కిలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోలు అతిథి పాత్రల్లో మెరవనున్నారని పుకార్లు వినిపిస్తుండ‌గా,తాజాగా మ‌రోపేరు వైర‌ల్ అవుతుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. హిందూ పురాణాల్లోని ఊర మాస్ క్యారెక్టర్ ‘పరుశురాముడు’. ఈ సినిమాలో సప్త చిరంజీవులు అయిన వేదం వ్యాసుడు, హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి.. పాత్రలను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ని పరుశురాముడు పాత్రలో చూపించడానికి నిర్మాతలు ప్రియాంక, స్వప్న దత్ సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం.

ఇక నేచుర‌ల్ స్టార్ నాని కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆయ‌న కృపాచార్య పాత్రలో కాసేపు కనిపించి అల‌రించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కల్కి 2898లో తాను నటిస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ ప్రకటించినట్లు సమాచారం..మొత్తానికి ప‌లువురు స్టార్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ని దుమ్ము రేప‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. స్టార్ హీరోలంద‌రిని ఒకే ఫ్రేములో అలా చూస్తే ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. ఇక ఈ మూవీని మే 9న విడుదల చేయ‌నున్నట్లు సమాచారం.