లాస్ ఏంజెల్స్‌లో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఆస్కార్ అవార్డ్ వేడుక‌.. విజేత‌లు ఎవ‌రంటే..!

లాస్ ఏంజెల్స్‌లో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఆస్కార్ అవార్డ్ వేడుక‌.. విజేత‌లు ఎవ‌రంటే..!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినీ అవార్డ్ వేడుక ఏదైన ఉంది అంటే అది ఆస్కార్ వేడుక అని చెప్ప‌వ‌చ్చు. ఆస్కార్ వేడుక‌లో క‌నీసం పాల్గొన్నా చాలు చాలా మంది క‌ళాకారులు భావిస్తారు. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆస్కార్ అవార్డ్ వేడుక‌కి చాలా త‌క్కువ మంది భార‌తీయులు హాజ‌రు కావ‌డంతో పాటు కొంద‌రు మాత్ర‌మే విజేత‌లుగా నిలిచారు. కొద్ది సేప‌టి క్రితం 96వ ఆస్కార్ వేడుక ప్రారంభం కాగా, విజేత‌లని ఒక్కొక్క‌టిగా ప్ర‌క‌టిస్తున్నారు. గ‌త ఏడాది ఆర్ఆర్ఆర్ బ‌రిలో ఉండ‌డంతో ఇండియ‌న్స్ ఈ వేడుక‌పై చాలా దృష్టి పెట్టారు. ఈ ఏడాది లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 11 (సోమవారం) తెల్లవారుఝామున కార్య‌క్ర‌మం మొద‌లు కాగా, ఈ వేడుక ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ఈ ఆస్కార్ అవార్డ్ వేడుకలను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు.


లాస్ ఏంజెల్స్‌లో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఆస్కార్ అవార్డ్ వేడుక‌.. విజేత‌లు ఎవ‌రంటే..!

ఉత్తమ నటుడు

కిలియన్ మర్ఫీ(ఒపెన్‌హైమర్)


ఉత్త‌మ న‌టి

ఎమ్మాస్టోన్ ( పూర్ థింగ్స్)


ఉత్తమ డైరెక్టర్

ఒపెన్‌హైమర్‌ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్


ఉత్త‌మ చిత్రం

ఓపెన్ హైమ‌ర్


ఉత్త‌మ స‌హాయ న‌టుడు

రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ ( ఓపెన్ హైమ‌ర్)


ఉత్త‌మ స‌హాయ న‌టి

డేవైన్ జో రాండాల్ఫ్ ( ది హోల్డ్‌వ‌ర్స్)


ఉత్త‌మ సినిమాటోగ్రఫీ

ఓపెన్ హైమ‌ర్


ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ ఫిల్మ్

20 డేస్ ఇన్ మ‌రియోపోల్


బెస్ట్ హెయిర్ స్టైయిల్ అండ్ మేకప్

న‌డియా స్టేసీ, మార్క్ కౌలియ‌ర్ ( పూర్ థింగ్స్)


ఉత్త‌మ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

కార్డ్ జెఫ‌ర్‌పన్ ( అమెరిక‌న్ ఫిక్ష‌న్)


ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే

జ‌ట్టిన్ ట్రెట్‌, అర్ధర్ హ‌రారీ( అనాట‌మీ ఆఫ్ ఎ ఫాల్‌)


ఉత్తమ యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం

ది బాయ్ అండ్ ది హిరాన్


ఉత్త‌మ కాస్ట్యూమ్ డిజైన్

హోలి వెడ్డింగ‌న్ ట‌న్ ( పూర్ థింగ్స్)


ఉత్తమ ప్రొడ‌క్ష‌న్ డిజైన్

జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)


ఉత్త‌మ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్

ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్


ఉత్త‌మ ఎడిటింగ్

జెన్నిఫ‌ర్ లేమ్ ( ఓపెన్ హైమ‌ర్)


ఉత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్స్

గాడ్జిల్లా, మైనస్ వ‌న్


ఉత్త‌మ డాక్యుమెంట‌రీ (షార్ట్ స‌బ్జెక్ట్‌)

ది లాస్ట్ రిపేర్ షాప్