ఇది కదా రామ్ చరణ్ అంటే.. ఆయన గురించి ఏకంగా పాక్ ఛానల్‌లో చర్చ

చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ నటనకి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ తర్వాత చరణ్ చేసిన చిత్రాలన్ని మంచి విజయాలు అందుకోగా, చివరిగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అదరగొట్టాడు. నటన, డ్యాన్స్, హావభావాలతో మైండ్ బ్లాక్ చేశాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ఆర్ఆర్ఆర్ సినిమా స్టార్టింగ్‌లో రామ్ చరణ్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు అని చెప్పాలి. వేలమంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అదరహో అనిపించింది. ఆయన అభిమానులకి అయితే ఈ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పించింది అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఈ యాక్షన్ సీన్ గురించి, రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్ గురించి పాకిస్తాన్ మీడియాలో చర్చించుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ రామరాజుగా వేలమంది మధ్యలోకి దూకి, అక్కడ వారందరిని చెదరగొట్టి, ఆ తర్వాత తిరిగి మళ్లీ తన పొజీషన్‌కి వచ్చి నిలబడడం నిజంగా మైండ్ బ్లోయింగ్ అని అనిపించిందని మాట్లాడుకున్నారు.
ఇది కదా రామ్ చరణ్ అంటే.. ఆయన గురించి ఏకంగా పాక్ ఛానల్‌లో చర్చశతృదేశమైన పాకిస్తాన్ ఛానెల్‌లో రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం నిజంగా గ్రేట్ అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రామ్ చరణ్ పాత్రకి హాలీవుడ్ ప్రముఖులు కూడా ముగ్ధులై ఇటీవల ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోని పాత్ర కోసం రామ్ చరణ్ లాంటి నటుడు తమకి కావాలని కోరింది. ఏది ఏమైన రామ్ చరణ్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుండడం తన ఫ్యామిలీతో పాటు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంతో బిజీగా ఉండగా, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే ప్రేక్షకుల ముందుకు రానుంది.