ఆ రోజు వారు నన్ను చంపేస్తారేమోనని చాలా భయపడ్డాను.. పృథ్వీ షా షాకింగ్ కామెంట్స్

భారత యువ బ్యాటర్ పృథ్వీ షాకి అదృష్టం కలిసి రావడం లేదు. వచ్చిన అవకాశాలని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎంత వేగంగా అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడో అంతే వేగంగా వెళ్లిపోయాడు. ఒకవైపు గాయల బెడద, బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం,మరోవైపు అనవసరపు వివాదాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ ముంబై కుర్రాడు ప్రస్తుతం కౌంటీల్లో ఆడుతూ త్వరలో ఐపీఎల్లో తన సత్తా చూపించాలని తహతహలాడుతున్నాడు. భారత జట్టు కోసం ఐదు టెస్ట్‌లు, 6 వన్డేలు, ఒక టీ20 ఆడిన పృథ్వీ ఇప్పుడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చాలా కసరత్తులు చేస్తున్నాడు. అతను జట్టుకి దూరమై రెండేళ్లు కావొస్తుంది. అయితే ఆ మధ్య మనోడు ఓ వివాదంతో వార్తలలోకి ఎక్కాడు.
గతేడాది యూట్యూబర్, నటి సప్నా గిల్‌తో పృథ్వీ షాకి పబ్లిక్‌గా గొడవ జరగడంతో అప్పుడు అది హాట్ టాపిక్ అయింది. దీనిపై తాజాగా వివరణ వచ్చాడు. ఆ రోజు నేను 7-8 మంది స్నేహితులతో కలిసి ముంబై సహారా స్టార్ హోటల్లోని బర్రెల్ క్లబ్‌కు వెళ్లాను. అక్కడ మా పక్కన టేబుల్‌పై కూర్చున్న నలుగురైదుగురు వ్యక్తులు నా దగ్గరకు సెల్ఫీ కోసం వచ్చారు. సెల్ఫీ ఫిక్స్ సరిగ్గా రాలేదని మరోసారి తీసుకున్నారు. అయితే అప్పుడు ఓ జంట నా భుజాలపై చేతులు వేసి వీడియో తీస్తున్నారు. దానికి నేను అభ్యంతరం చెప్పాం. మేము అసౌకర్యంగా ఫీలవుతున్న నేపథ్యంలో హోటల్ మేనేజర్ వారిని బయటకు పంపించాడు. ఆ తర్వాత కాసేపటికి నేను కూడా హోటల్ ముందు గేట్ నుంచి బయటకు వచ్చాను.
అయితే అప్పుడు హోటల్ బయట సప్నా గిల్ బేస్ బాల్ బ్యాట్‌తో నిల్చొని ఉంది. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న వారు నాకు మనుషుల మాదిరిగా కనిపించలేదు. నేను కారులో బయలుదేరాను. సీఐఎస్ఎఫ్ చెక్ పోస్ట్ వద్ద స్లో చేయగానే నా కారుపై బేస్ బాల్ బ్యాట్‌తో దాడి చేశారు. ఆ సమయంలో నేను కారు బయటకు వచ్చి ఆమె చేతిలోని బేస్ బాల్ బ్యాట్ లాగేసాను. అప్పుడు ఆమె చేతిలో నుంచి బ్యాట్ లాక్కునే వీడియోను మాత్రమే సోషల్ మీడియా షేర్ చేసి నన్ను బ్యాడ్ చేశారు. అప్పుడు నా స్నేహితుల కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా బీఎమ్‌డబ్ల్యూ కారు అక్కడే వదిలేసాను. నా స్నేహితులు కారును ఇంటికి తీసుకొస్తారని చెప్పడంతో వెళ్లిపోయాను. అనంతరం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా స్నేహితులు ఎవరూ కూడా సప్నా గిల్‌ను తాకలేదు. ఆమె కేసును తన ఫేవర్‌గా మార్చుకునేందుకు అసత్య ఆరోపణలు చేసింది. అక్కడ ఉన్న అన్నీ కెమెరాల్లో చెక్ చేసుకోవాలని కూడా మేం పోలీసులతో పాటు కోర్టుకు తెలియజేశాం.’అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు