త్రిషనే కాదు ఐశ్వర్యరాయ్‌ని కూడా రేప్.. ఈ నటుడి కామెంట్స్‌పై ఆగ్రహం

ఓ ఇంటర్వ్యూలో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ఎంత పెద్ద వివాదానికి దారి తీసాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, ‘లియో’ సినిమాలో ఛాన్స్ రావడంతో త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని భావించానని, కానీ సీన్ లేకపోవడంతో బాధగా అనిపించిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఆమెకి ఇండస్ట్రీ నుండే కాక బయట నుండి కూడా పలువురు మద్దతు ఇస్తూ మన్సూర్‌కి కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. అయితే మన్సూర్ మాత్రం త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, అందుకే క్షమాపణ కూడా కోరనని అంటున్నాడు.
త్రిషకు క్షమాపణ చెప్పని కారణంగా నడిగర్ సంఘం తనపై నిషేధం విధించడంపై స్పందించిన మన్సూర్.. వివరణ అడగకుండా, విచారణ జరపకుండా చర్యలు తీసుకోవడం ఏంటి? తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకునేందుకు నడిగర్ సంఘానికి 4 గంటలు సమయమిస్తున్నానని డెడ్‌లైన్ విధించారు. అయితే మన్సూర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయంలో చిన్మయి వివాదాన్ని మరింత రాజేసింది. గతంలో రాధారవి మాట్లాడిన మాటలని తెరపైకి తీసుకొచ్చింది. రాధా రవి ఒక ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ మీద వెకిలిగా మాట్లాడగా, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
వీడియోలో రాధా రవి మాట్లాడుతూ.. ఒక వేళ తనకు హిందీ వచ్చి ఉంటే.. ఐశ్వర్యా రాయ్‌ని రేప్ చేసి ఉండేవాడ్ని.. అక్కడి వాళ్లు నాకు మంచి పాత్రలు ఎలాగూ ఇచ్చేవారు కదా?.. అలాంటి రేప్ చేసే పాత్రలే వచ్చేవి అన్నట్టుగా రాధా రవి వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే అప్పట్లో ఆయన వ్యాఖ్యలని ఎవరు సీరియస్ తీసుకోలేదు. కాని మన్సూర్ చేసిన కామెంట్స్‌పై మాత్రం ప్రతి ఒక్కరు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత దారుణంగా మాట్లాడిన రాధా రవిపై ఎవరు రియాక్షన్లు చూపించడం లేదు ఎందుకు? నాకు అర్థం కావడం లేదు అంటూ చిన్మయి ప్రశ్నించింది.ఇలాంటి వ్యక్తులు మానవవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ తన సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేసింది చిన్మయి.