నా భార్య నన్ను కొడుతుందంటూ స్టార్ హీరో కంప్లైంట్.. అందరు షాక్..!

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాలలో ఎంతో మంది హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన రణబీర్ కొంతమందితో ప్రేమాయణం కూడా నడిపాడు. చివరిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ని వివాహం చేసుకున్నాడు. ఇటీవల అలియా పండంటి బేబికి జన్మనిచ్చింది. దీంతో ఈ జంట ఒకవైపు బేబి ఆలనాపాలనా చూసుకుంటూ మరోవైపు తమ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. రణబీర్ నటించిన తాజా చిత్రం యానిమల్ కాగా, ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రణబీర్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. దేశమంతా తిరుగుతూ తమ మూవీపై ఆసక్తి పెంచుతున్నారు. ఇటీవల యానిమల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఒక ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లో సినిమా గురించి మాత్రమే కాకుండా, తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశాడు రణబీర్ కపూర్. తన భార్య ఆలియా భట్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిత్రంలో తన పాత్రలతో తను చాలా డిటాచ్ ఉంటానని రణబీర్ క్లారిటీ ఇచ్చాడు.
తమను ప్రేమించి వారిపై మంచి ప్రభావం చూపించదని చెప్పిన రణబీర్.. నేను ఇంటికి వెళ్లి ఇలాగే ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది అని ఫన్నీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం రణబీర్ చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. ఇక యానిమల్ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా, రష్మిక, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏ సినిమాకు లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో యానిమల్ మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత రణబీర్ యాక్టింగ్ యానిమల్ కు ప్లస్ అవుతుందని అందరు భావించడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.