23 ఏళ్ల‌కే పెళ్లి చేసుకోవాలని అనుకున్న సాయి ప‌ల్ల‌వి..వాయిదా ఎందుకు వేసిందంటే…!

23 ఏళ్ల‌కే పెళ్లి చేసుకోవాలని అనుకున్న సాయి ప‌ల్ల‌వి..వాయిదా ఎందుకు వేసిందంటే…!

మ‌ల‌యాళి పిల్ల అయిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది సాయి ప‌ల్ల‌వి. త‌న న‌ట‌న‌, డ్యాన్స్‌తో యువ‌త‌ని క‌ట్టి ప‌డేసే ఈ అందాల ముద్దుగుమ్మ అన్ని భాష‌ల‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో నాగ చైత‌న్య‌తో క‌లిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. ల‌వ్ స్టోరీ సినిమా త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సినిమా ఇది. మూవీపై మాత్రం ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే సాయి ప‌ల్లవి ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైన విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా సాయి ప‌ల్ల‌వి సోద‌రి పూజా క‌న్న‌న్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌ని ద‌గ్గ‌రుండి ఘ‌నంగా జ‌రిపింది సాయి ప‌ల్ల‌వి.

నిశ్చితార్థం వేడుక‌లో సాయి ప‌ల్లవి చేసిన డ్యాన్స్ వీడియాలు కూడా బ‌య‌ట‌కు రాగా, అవి చూసి నెటిజ‌న్స్ అద‌ర‌హో అంటున్నారు. అయితే త‌న కంటే ముందే చెల్లెలి పెళ్లి చేస్తున్న సాయి ప‌ల్ల‌వి ఆమె ఎప్పుడు చేసుకుంటుందా అని అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అసలు సాయిపల్లవి 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు కనాలని కూడా అనుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని లేడి ప‌వ‌ర్ స్టారే స్వ‌యంగా చెప్పింది. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కొత్తలో సాయిపల్లవి పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వ‌గా, ఆ స‌మ‌యంలో త‌న పెళ్లిపై వచ్చిన ప్రస్తావన రాగా, చాలా ఓపెన్‌గా చెప్పింది. ఇప్పుడు ఆ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

‘నేను 18 ఏళ్లు ఉన్నప్పుడు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని భావించాను. 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలని ఊహించుకున్నాను. ఎంబీబీఎస్ చేసే ప్రారంభంలో అలా అనుకున్నాను. కానీ తర్వాత ఆ నిర్ణయాలను మార్చుకున్నాను. మా ఇంట్లోని కొన్ని కీలకమైన బాధ్యతలను తీసుకోవాల్సి రావడంతో పెళ్లిని వాయిదా వేశాను. కానీ నటిగా మంచి గుర్తింపు దక్కడంతో పెళ్లికి ఇంకాస్తా సమయం పొడిగించానంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఇక తను చేసుకోబోయే వాడు ‘ఇన్నోసెంట్ గా ఉండాలని, మహిళలకు రెస్పెక్ట్ చేయాలని.. కొంచెం చిన్నపిల్లల మనస్థత్వం కలిగి ఉండాలని’ అత‌నికి కాబోయే వాడికి క్వాలిటీస్ కూడా చెప్పింది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి అప్ప‌ట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.