స‌మంత వెళ్లిపోయినా ఆమె ఫొటో ఇంట్లో పెట్టుకున్న నాగార్జున‌.. ఎందుకు?

  • By: sn    breaking    Feb 05, 2024 11:06 AM IST
స‌మంత వెళ్లిపోయినా ఆమె ఫొటో ఇంట్లో పెట్టుకున్న నాగార్జున‌.. ఎందుకు?

నాగ చైతన్య, సమంత జంట‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్క‌ర్లేదు. ఇద్దరు కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ జంట‌ 2017లో గోవాలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోవడానికి ముందు మూడు సంవత్సరాల పాటు వారు డేటింగ్ చేశారు. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. పెళ్లి అయి విడాకులు తీసుకున్న కూడా నాగ చైతన్య, సమంత‌ ల మీద సోషల్ మీడియా లో ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

అస‌లు వారి విడాకుల‌కి కార‌ణం ఏంటో తెలియ‌దు కాని నెట్టింట మాత్రం ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా సమంత నాగ చైతన్య ల గురించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్నప్పటికీ స‌మంత ఫొటోని నాగార్జున త‌న ఇంట్లో హాల్‌లో ఉంచార‌ట‌. ఎందుకు ఉంచావ్, తీసేయ‌మ‌ని చెప్పిన కూడా నాగార్జున ఆ ఫొటోని అలానే ఉంచాడ‌ట‌. అయితే నాగార్జున‌.. స‌మంత‌తో ఉన్న త‌మ ఫ్యామిలీ ఫోటో తొలగించక పోవడానికి కారణం, అందులో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఉండటమేనట.ఆ ఫోటోలో నాగార్జున, అమల అఖిల్ తో పాటు చాలా మంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నార‌ని అందుకే తీయ‌డం లేద‌ని స‌మాచారం.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక సమంత – నాగ చైతన్య విడిపోవడానికి కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. నాగ చైతన్య ఎక్కడ కూడా ఈ విషయం పై మాట్లాడలేదు కాని సమంత మాత్రం పరోక్షంగా పలు ఇంటర్వ్యూల్లో, మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పరోక్షంగా విడాకులపై కామెంట్స్ చేస్తూనే ఉంది. ఇక నాగ చైత‌న్య ప్ర‌స్తుతం శోభిత‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని ప్ర‌చారాలు సాగుతుండ‌గా, క‌స్ట‌డీ మూవీ ప్ర‌మోష‌న్‌లో దీనిపై ఇన్‌డైరెక్ట్‌గా ప‌లు కామెంట్స్ చేశాడు. తన గతంతో సంబంధం లేని మూడోవ్యక్తిని కూడా నా ప‌ర్స‌న‌ల్ విష‌యంలోకి లాగి వార్తలు రాశారని, దానివల్ల ఆ మూడో వ్యక్తిని కూడా అగౌరవ పరిచార‌ని చైతూ అన్నాడు