సినిమాలు చేయ‌క‌పోతేనేం.. స‌మంత ఇలా రెచ్చిపోతూ ర‌చ్చ చేస్తుంటే ఫ్యాన్స్‌కి ఆనంద‌మేగా..!

సినిమాలు చేయ‌క‌పోతేనేం.. స‌మంత ఇలా రెచ్చిపోతూ ర‌చ్చ చేస్తుంటే ఫ్యాన్స్‌కి ఆనంద‌మేగా..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత‌ని విడాకులు, మ‌యోసైటిస్ వ్యాధి చాలా కుంగ‌దీసాయి. వాటి వ‌ల‌న చాలా డిప్రెష‌న్‌లో కొన్నాళ్లపాటు ఉండిపోయిన స‌మంత ఇప్పుడు తిరిగి పుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. 2010లో ఏమాయ చేశావే సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ భామ‌.. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతోంది. తెలుగు, తమిళ్ లోనే కాకుండా.. హిందీలో కూడా తన మార్క్ చూపిస్తూ శ‌భాష్ అనిపించుకుంటుంది. ఈ స‌మంత సినిమాల‌కి మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం లేదు. టాక్ షోలు, వెబ్ సిరీస్లు కూడా చేస్తూ అద‌ర‌హో అనిపిస్తుంది. మ‌రి కొద్ది రోజులలో సిటాడెల్ ఇండియన్ వర్షన్ తో ప్రేక్షకులని ప‌ల‌కరించ‌నుంది.

అయితే మయోసైటిస్ వ‌ల‌న సినిమాల‌కి కొంత బ్రేక్ ఇచ్చిన స‌మంత‌కి క్రేజ్ ఏ మాత్రం త‌గ్గలేదు. సినిమాల‌తో ఇప్పుడు అల‌రించ‌లేక‌పోతున్న స‌మంత సోషల్‌ మీడియాతో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. రోజురోజుకి మ‌తులు పోగొట్టే అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌ని కుదురుగా ఉండ‌నివ్వ‌డం లేదు. విడాకుల త‌ర్వాత స‌మంత గ్లామ‌ర్ షో మ‌రింత ఎక్కువైంది. తాజాగా బ్లాక్‌ కోట్‌ ధరించి ఆమె కెమెరాకి పోజులిచ్చింది. బ్రా అందాలు కనిపించేలా స‌మంత రెచ్చిపోతుండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రస్తుతం ఆమె షేర్‌ చేసిన పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండ‌గా, అభిమానులు మాత్రం వాటిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

స‌మంత త‌న పోస్ట్‌కి “డిస్నీ ప్రిసెస్ లా నేను ఫెయిల్ అయ్యాను.. కాని నేను ఇప్పుడు డ్రాగన్” అంటూ కామెంట్ పెట్టింది. ఇది సరదాగా పెట్టింద‌ని అనుకున్నా ఈ భామ రానున్న రోజుల‌లో విజృంభించబోతున్నాను అని మెసేజ్ ఇచ్చినట్లే ఉంది.ఏది ఏమైన‌ స‌మంత రానున్న రోజుల‌లో మ‌రింత ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ భామ చివరగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ `ఖుషి` చిత్రంలో నటించారు.ఈ సినిమాతో ఓ మోస్త‌రు హిట్‌ అందుకుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు చేసింది లేదు. ప్ర‌స్తుతం వెరైటీ క‌థ‌ల‌ని ఎంచుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.