Viral Video | కేర‌ళ‌లో మ‌హిళ‌ల దాండియా నృత్యం.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Viral Video | కేర‌ళ‌లో మ‌హిళ‌ల దాండియా నృత్యం.. ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Viral Video | ద‌స‌రా పండుగ‌, దుర్గాష్ట‌మి వేడుక‌ల నేప‌థ్యంలో ఎక్క‌డ చూసినా న‌వ‌రాత్రుల సంద‌డే క‌నిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో న‌వ‌రాత్రుల‌ను మ‌హిళ‌లు ఎంతో ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటారు. ఉప‌వాస దీక్ష‌లు చేస్తారు. దాండియా ఆడుతూ ప‌ర‌వ‌శించి పోతారు. న‌వ‌రాత్రులు అంటేనే దాండియాకు పెట్టింది పేరు.

మ‌హిళ‌లు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి దాండియా నృత్యం చేస్తుంటారు. ల‌య‌బ‌ద్ధంగా చేసే ఈ నృత్యం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఇక గుజ‌రాత్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో దాండియా ఫేమస్‌. ఇత‌ర రాష్ట్రాల్లో స్థిర‌ప‌డ్డ ఈ రెండు రాష్ట్రాల వారు.. స్థానిక మ‌హిళ‌ల‌తో క‌లిసి ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దాండియా ఆడుతారు.

అయితే ద‌స‌రా న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా కేర‌ళ‌లో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ట్వీట్ చేశారు. ‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టైల్లో దాండియా నృత్యం’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పెద్దపెద్ద కర్రలతో మహిళలు దాండియా ఆడుతున్న వీడియోను చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.