అందరి ఓటు శివాజీకే.. రతికని అలా తీసిపడేశారేంటి..!

బిగ్ బాస్ సీజన్ 7లో పదో వారం మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిపోయింది. హౌజ్‌మేట్స్ ఫ్యామిలీ సభ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి వస్తూ ఫుల్ ఎంటర్మైన్మెంట్ పంచుతూనే విలువైన సలహాలు ఇచ్చారు. ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగింది. . ‘హో బేబీ’ టాస్క్‌తో హౌస్‌లోని సభ్యుల మధ్య ఓ టాస్క్ పెట్టిన బిగ్ బాస్.. ఆ టాస్క్‌లో చివరిగా మిగిలిన శివాజీ, అర్జున్.. ఇద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం పొందుతారని తెలియజేస్తారు. అయితే ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఇది సాగుతుందని, తానే ఇందులో గెలుస్తానని శివాజి ధీమాగా ఉన్నాడు. అయితే శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగ్ ముందుగా శుక్రవారం ఎపిసోడ్ చూపించారు. ఇందులో ఎప్పటి మాదిరిగానే డిస్కషన్ లు, అరుచుకోవడాలు వంటివి జరిగాయి.
అనంతరం మన టీవీ ద్వారా ఇంటి సభ్యులని పలకరించిన నాగ్ ముందుగా శోభ కెప్టెన్సీ గురించి హౌస్‌లో ఉన్న అందర్నీ వాకబు చేసారు. దాదాపు అందరు గుడ్ కెప్టెన్సీ అని తేల్చేశారు. అనంతరం అర్జున్, శివాజీలో ఒక్కరిని కెప్టెన్‌గా ఎన్నుకునే సమయం వచ్చింది. అందుకోసం హౌజ్‌మేట్స్ ఒక్కొక్కిరిగా వెళ్లి ఏ కంటెస్టెంట్ అయితే కెప్టెన్‌గా వద్దనుకుంటున్నారో వారి కిరీటంకి ఉన్న రత్నం తీసి పక్కన పెట్టి అందుకు గల కారణం కూడా చెప్పాలని నాగార్జున అంటారు. ఇదంతా.. సీక్రెట్‌గా జరుగుతుందని.. హౌస్‌లోని సభ్యులెవరికీ.. కన్ఫెషన్ రూంలో మీరు మాట్లాడేది తెలియని చెబుతారు నాగ్.
దీంతో హౌస్‌లోని సభ్యులందరూ అందరూ కూడా శివాజీ కే ఓటు వేస్తారు. అప్పటి వరకు ఉన్న గొడవలను పట్టించుకోకుండా.. యునానిమస్‌గా శివాజీనే ఎన్నుకోవడం విశేషం. ముందు రోజు శివాజితో భీబత్సమైన గొడవ పడిన గౌతమ్ కూడా శివాజి కెప్టెన్సీ చూడాలని అనుకున్నాడు. అర్జున్ అప్పటికే కెప్టెన్ అయ్యాడనే ఒకే ఒక కారణంతో… శివాజీ వైపు ఉన్న వారి మనస్తత్వంతో ఈ వారం కెప్టెన్‌గా శివాజిని ఎంపిక చేశారు. శివాజీ కెప్టెన్ కావడంతో శోభా శెట్టి కిరీటాన్ని ఆయనకు పెట్టింది. అర్జున్ కెప్టెన్సీ బ్యాడ్జీని శివాజీకి ధరింపచేశారు. ఇక నాగార్జున కోసం శోభా ప్రత్యేకంగా కాఫీ పెట్టి పంపించింది. అది చాలా సూపర్భ్‌గా ఉందని నాగ్ అన్నాడు. ఇక రతిక గురించి మాట్లాడుతూ ఏంటి రతిక.. శివ నీకు రోజ్ ఇచ్చాడు, దానిని తీసుకుంటున్నావేంటని అడగగా, దానికి రతికా సమాధానం ఇస్తూ అన్నయ్య ఇస్తున్నట్లు భావించాను సర్ అని చెప్పింది.. నాగార్జున స్పందిస్తూ అమ్మా నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ్య అంటావో.. ఫ్రెండ్ అంటావా అర్థం కావడం లేదు అని అనగా పక్కనే ఉన్న ప్రశాంత్ తెగ నవ్వేశాడు. ఇక తర్వాత పాస్ ఫెయిల్ గేమ్ ఆడించగా, ఇందులో ఫెయిల్ ఆప్షన్లో ఎక్కువ మంది రతికనే ఎంపిక చేశారు.