సుమకి ఎంత కష్టం వచ్చింది… మేకప్ లేకపోతే అది కూడా గుర్తు పట్టడం లేదట..!

టాలీవుడ్ స్టార్ యాంకర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది సుమ. ఎన్నో ఏళ్ల నుండి తన యాంకరింగ్‌తో అలరిస్తూ వస్తున్న సుమ ట్రెండ్‌కి తగ్గట్టు నడుచుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అలరిస్తుంది.తాజాగా సుమ మేకప్ రూమ్‌లో మేకప్ వేసుకుంటన్న వీడియోని షేర్ చేసింది. అయితే తన ల్యాప్ టాప్‌కి సుమ ఫేస్ స్కానింగ్ పాస్ వర్డ్ పెట్టుకోగా, ముందుగా మేకప్ లేకుండా స్కాన్ చేసింది. అప్పుడు లాక్ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత మేకప్ వేసుకొని మళ్లీ ల్యాప్ టాప్ ముందు ఫేస్ ఉంచింది. దీంతో లాక్ ఓపెన్ అయింది. ఇది సుమని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం సుమకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.ఈ వీడియోకి నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. మేకప్ లేకపోతే మేమే గుర్తు పట్టలేకపోతున్నాం. ఇక ల్యాప్ టాప్ ఏం గుర్తు పడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుమ కనకాల ఇప్పటికీ యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె ఓ వైపు టీవీ షోస్, మరో వైపు సినిమా ఈవెంట్లు చేస్తూ చాల బిజీగా ఉంది. ప్రస్తుతం సుమ అడ్డా`కి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు అప్పుడప్పుడు స్పెషల్ ఎపిసోడ్లు, టాక్ షోలు వంటివి చేస్తూ అలరిస్తుంది. అలాగే సినిమా ప్రెస్మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు మధ్య మధ్యలో తన సొంత యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టా రీల్స్ పై ఫోకస్ పెట్టి నెటిజన్స్ సైతం అలరిస్తుంది. ఈ సినియర్ యాంకర్ జోరుకి కొత్త యాంకర్స్ సైతం బేజారైపోతున్నారు.
ఇక రీసెంట్గా సుమ ఓ వివాదంలో ఇరుక్కోగా, క్షమాపణలు చెప్పి ఆ వివాదానికి పులిస్టాప్ పడేలా చేసింది. వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవకి సంబంధించి ఓ ఈవెంట్ జరగగా, ఆ ఈవెంట్లో సుమ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా వారిపై పంచ్‌లు విసిరింది.జర్నలిస్ట్‌లు స్నాక్స్‌ని భోజనాల్లా చేస్తున్నారని కామెంట్స్ చేసింది. అప్పుడు జర్నలిస్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేయగా, సారీ అండి మీరు స్నాక్స్ స్నాక్స్ లానే తిన్నారని అంది. అయితే సుమ మాటలపై జర్నలిస్ట్‌లు కోపోద్రిక్తులు కావడంతో స్టేజ్ మీదనుండే సారీ చెప్పి, తిరిగి సోషల్ మీడియాలోను వారికి క్షమాపణలు తెలియజేసింది.