చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లేంటో స్వయంగా చెప్పిన సురేఖ..విని అంతా షాక్

టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో మనం చూస్తున్నాం. చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదగగా, పవన్ కళ్యాణ్ తన అన్న వేసిన బాటలో పయనించి అంచెలంచెలుగా ఎదిగారు. పవర్ స్టార్‌గా అశేష ప్రేక్షకాదరణ పొందారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లని అభిమానులు సినిమా హీరోలుగానే కాకుండా మంచి మనస్సున్న మనుషులుగా కూడా ఇష్టపడుతుంటారు. చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టగా, పవన్ ప్రజలకి సేవ చేయాలని భావించి రాజకీయాలలోకి వచ్చారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనేక సామజిక సేవ కార్యక్రమాలు చేయడం ద్వారా ఎందరో మనసుల్లో గూడు కట్టుకున్నారు. అయితే వీరికి సంబంధించిన ఏదైన విషయాలు బయటకు వస్తే అవి తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్ల గురించి సురేఖ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇద్దరి ఆహారపు అలవాట్లు దాదాపు ఒక్కటిగానే ఉంటాయని, ఫలానా కావాలని పెద్దగా డిమాండ్ ఉండదు. పచ్చడి మెతుకులని కూడా పరమాన్నంగా భుజిస్తారు.ఏది ఉంటే అది తినేస్తారు. అయితే నాగబాబు మాత్రం వీరిద్దరికి భిన్నంగా. భోజనంలో అన్ని రకాల రుచులు ఉండాలని చెప్పింది సురేఖ
భోజనం విషయంలో మా మామ గారు మాత్రం చాలా పద్దతిగా చక్కగా తింటారు. ఆయన తినడం చూస్తుంటే పక్కవాళ్లకి కూడా తినాలని అనిపిస్తుంది. నాకు వంటలు పెళ్లయ్యాకే వచ్చాయి. పెళ్లి అయిన తర్వాత ఒకసారి ఉప్మా చేస్తే అంది ఉండలు ఉండలుగా వచ్చింది . అయితే మా మావయ్య, అత్తగారు వంటలు బాగా చేస్తారు. వారి నుండే నేను వంటలు నేర్చుకున్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది సురేఖ. ఇక ఇదిలా ఉంటే ఉమెన్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోసం స్పెషల్ గా వంట చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. అమ్మ కోసం వంట వండుతున్న చరణ్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.