పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ జాబితా చూస్తే.. దిమ్మతిరిగిపోద్ది..!

ఈ రోజుల్లో హీరోయిన్స్ చాలా అప్డేట్ అయిపోయారు. ఒకప్పుడు హీరోయిన్స్ చాలా పద్దతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించే వారు. కాని ఈ జనరేషన్‌కి వచ్చే సరికి మాత్రం ఒంటి మీద గుడ్డలు నిలవడం లేదు. ఇక కొందరైతే ప్రేమాయణాలని, డేటింగ్లని విచిత్ర పోకడ పోతున్నారు. అయితే మన హీరోయిన్స్ చాలా మంది పెళ్లికి ముందే ప్రగ్నెంట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఇండస్ట్రీలో ఏయే హీరోయిన్స్ పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయ్యారు అనేది చూస్తే.. ముందుగా ఇలియానా గురించి చెప్పుకోవాలి.. ఈ గోవా బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లి కాగా, బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని కూడా చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచింది.
ఇక బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అలియాభట్.. 2022లో రణబీర్‌ని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన వెంటనే తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. ఇక అందాల ముద్దుగుమ్మ అమీ జాక్సన్ కూడా పెళ్లి కాకుండానే తల్లి అయింది. ఇక రేణూ దేశాయ్ కూడా పెళ్లి కాకుండానే తల్లి అయింది. బద్రి సినిమాలో పవన్‌తో నటించిన రేణూ దేశాయ్.. ఆ సమయంలో పవన్‌తో ప్రేమలో పడింది. కొంతకాలం పాటు ఇద్దరు డేటింగ్ చేశారు. ఈ క్రమంలో రేణుదేశాయ్ ప్రెగ్నెంట్ అయింది. అకిర పుట్టాక ఇద్దరూ పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత ఆద్యకి జన్మనిచ్చారు.
మరో హీరోయిన్ పూర్ణ కూడా పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయినట్టు తెలుస్తుంది. హీరోయిన్‌గానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్‌లోను నటించిన పూర్ణ.. షామీద్ రషీద్‌ను పెళ్లి చేసుకుని ఆరు నెలలు గడవక ముందే బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూడా పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయినట్టు తెలుస్తుంది. పెళ్లికి ముందే నిర్మాత బోనీకపూర్‌తో ప్రేమలో పడిన శ్రీదేవి..అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్‌తో డేటింగ్ చేసి ప్రెగెంట్ అయింది. బోని కపూర్, శ్రీదేవి దంపతులకి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్ మాజీ భార్య సారిక కూడా పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయింది. కమల్ హాసన్ తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి కాకుండానే శృతిహాసన్ లకి జన్మనిచ్చారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో కమల్‌హాసన్‌ను పెళ్లి చేసుకొని ఆ తర్వాత అక్షర హాసన్ కి జన్మనిచ్చింది. ఇలా పలువురు హీరోయిన్స్ పెళ్లి కాకుండానే ప్రగ్నెంట్ కావడం చాలా మందిని ఆశ్చర్యపరచింది.