ఈ వారం ఓటీటీలో గుంటూరం కారంతో పాటు మ‌రిన్ని క్రేజీ చిత్రాలు.. ఏంటంటే..!

ఈ వారం ఓటీటీలో గుంటూరం కారంతో పాటు మ‌రిన్ని క్రేజీ చిత్రాలు.. ఏంటంటే..!

చూస్తుండ‌గానే కొత్త ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లోకి అడుగుపెట్టాం. ఇక ఓటీటీలో ప్ర‌తి వారం వైవిధ్య‌మైన సినిమాలు సంద‌డి చేస్తుండ‌గా, ఈ వారం ఎలాంటి చిత్రాలు అల‌రించ‌బోతున్నాయా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా 23 సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేట‌ర్‌లో ఈగ‌ల్ లాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు రెడీ అవుతుండ‌గా, ఇప్పుడు ఓటీటీలో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు సంద‌డి చేయ‌బోతున్నాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే మొద‌టిగా డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05నుంచి స్ట్రీమింగ్ అవుతుంది 2. ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05నుంచి, 3. మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05నుంచి ,4. మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05నుంచి , 5. ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05నుంచి , 6. లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07 నుండి, 7. రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07న స్ట్రీమింగ్ కానుంది.

ఇక లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా, వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 నుండి, గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 నుండి, 11. భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09 నుండి, 12. లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 నుండి, యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 నుండి, 14. ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 నుండి,15. ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 నుండి, 16. హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10 నుండి, 17. బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆహాలో 18. బబుల్​గమ్​ప్రీమియర్స్​- ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, అమెజాన్ ప్రైమ్ లో కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇక డిస్నీప్లస్ హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా 20. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో 21. కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 నుండి స్ట్రీమింగ్ ,22. లాంత్రానీ(హిందీ సినిమా) – ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ కానున్నాయి. బుక్ మైషోలో చూస్తే 23. అక్వామాన్​అండ్ ది లాస్ట్ కింగ్​డమ్​- ఫిబ్రవరి 5నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఈ వారం మ‌హేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కన్నడ స్టార్‌ దర్శన నటించిన కాటేరా సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్‌ భక్షక్‌, సుస్మితా సేన్ ఆర్య-3 వెబ్ సిరీసులు చాలా ఆస‌క్తి రేపుతున్నాయి.